Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ వ‌ర్సెస్ రౌడీ స్టార్‌..ఎవ‌రు బెస్ట్‌

By:  Tupaki Desk   |   4 Feb 2022 12:30 PM GMT
సూప‌ర్‌స్టార్ వ‌ర్సెస్ రౌడీ స్టార్‌..ఎవ‌రు బెస్ట్‌
X
అందిరికి షాకిస్తూ తూఫాన్ అంటూ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ థ‌మ్స్ అప్ యాడ్ లో త‌ళుక్కున మెరిసి త‌న యాక్ష‌న్ స్టంట్ ల‌తో మెస్మ‌రైజ్ చేశాడు. ఫిబ్ర‌వ‌రి 1న ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ని విడుద‌ల చేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ‌త కొన్నేళ్లుగా ఈ యాడ్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ విష‌యం తెలిసిందే. అయితే స‌డ‌న్ గా ఇది చేతులు మారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌క్క‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చాలా మంది ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

ఇక ఈ యాడ్ సోష‌ల్ మీడియాలో నిజంగానే తూఫాన్ గా సంచ‌ల‌నం సృష్టించి వైర‌ల్ గా మారింది. అంతే కాకుండా ఈ యాడ్ లో స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీన్స్‌.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశాయి. `లైగ‌ర్‌` సినిమాతో పాన్ ఇండియా ని టార్గెట్ చేసిన విజ‌య్ ఆ సినిమా రిలీజ్ కి ముందే థ‌మ్స్ అప్ యాడ్ తో పాన్ ఇండియా రేంజ్ లో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ యాడ్ ని వ‌దిలేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా మ‌రో బ్రాండ్ కి ప్ర‌చార క‌ర్త‌గా మారారు. అదే `మౌంటేన్ డ్యూ`. దీనికి సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్‌ యాడ్‌ని ఇటీవ‌లే షూట్ చేసి శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 4న‌ విడుద‌ల చేశారు. దుబాయ్ లోని అత్యంత పాపుల‌ర్ అయిన బూర్జు ఖ‌లీఫాపై ఈ యాడ్ ని షూట్ చేశారు. మోట‌ర్ బైక్ పై డ్రైవ్ చేస్తూ బూర్జ్ ఖ‌లీఫాపై నుంచి మ‌హేష్ నేల‌కి దిగే ఫీట్ ల‌తో దీన్ని రూపొందించారు.

ఆద్యంతం గ్రాఫిక్స్ ని వాడిన ఈ యాడ్ మ‌హేష్ అభిమానుల‌కు ఏ రేంజ్ లో న‌చ్చేసింది. అయితే రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ `థ‌మ్స్ అప్‌` యాడ్ తో మ‌హేష్ `మౌంటేన్ డ్యూ` యాడ్ ని కంపేర్ చేస్తూ తాజాగా నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. మ‌హేష్ యాడ్ ని కొంత మంది క్రిటిసైజ్ చేస్తుంటే మ‌రి కొంత మంది విజ‌య్ దేవ‌ర‌కొండ థ‌మ్స్ అప్ యాడ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మ‌హేష్ చేసి `మౌంటేన్ డ్యూ` యాడ్ లో ఆచ‌ర‌ణ‌కు సాధ్యం కానీ ఫీట్‌ని గ్రాఫిక్స్ ఆధారంగా చూపించార‌ని, అంతే కాకుండా బూర్జ్ ఖ‌లీఫా పై నుంచి బైక్ కిందికి డ్రైవ్ చేస్తున్న క్ర‌మంలో మ‌హేష్ ని కాకుండా డూప్ తో స‌రిపెట్టార‌ని, మ‌హేష్ యాడ్ కృత్రిమంగా వుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ యాడ్ అత్యంత స‌హ‌జంగా వుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. థ‌మ్స్ అప్ యాడ్ ల‌కు ఓ ప్ర‌త్యేక‌త వుంది. అదే ప్ర‌త్యేక‌త విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన యాడ్ లో క‌నిపించింద‌ని, పేరుకు త‌గ్గ‌ట్టే `తూఫాన్ ` లా వుంద‌ని ప్ర‌శంస‌ల్లో ముంచేస్తున్నారు.