Begin typing your search above and press return to search.

ర‌షెస్ చూశాను చాలా గ‌ర్వంగా వుంది : మ‌హేష్‌

By:  Tupaki Desk   |   6 Dec 2021 9:00 PM IST
ర‌షెస్ చూశాను చాలా గ‌ర్వంగా వుంది : మ‌హేష్‌
X
స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోలీశ్వ‌రులు`. గ‌త కొన్ని వారాలుగా ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న ఈ షో తొలి సీజ‌న్ ఈ ఆదివారంలో ముగిసింది. ఈ ఆఖ‌రి ఎపిసోడ్‌ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాల్గొని సంద‌డి చేశారు. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్‌ లు ఎదురెదురు సీట్ల‌లో కూర్చుని క‌నిపించ‌డం ఫ్యాన్స్‌కి ఓ పండ‌గ‌లా క‌నిపించింది.

బుల్లితెర‌పై ఇలా ఈ ఇద్ద‌రు స్టార్‌ లు క‌లిసి ఒకే వేదిక‌పై పాలు పంచుకోవ‌డం.. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ అడిగిన ఫ‌న్నీ ప్ర‌శ్న‌ల‌కు అంతే స‌మ‌య‌స్ఫూర్తితో మ‌హేష్ ఫ‌న్నీగా సామాధానాలు చెప్ప‌డం వీక్ష‌కుల్ని ఆనందానుభూతికి లోను చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ట‌క ట‌కా స‌మాధానం చెప్పిన మ‌హేష్ 25 ల‌క్ష‌లు గెలుచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఎన్టీఆర్‌ తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం హీరోగా `స‌ర్కారు వారి పాట‌` చిత్రంతో బిజీగా వున్నారు మ‌హేష్ ఆ మూవీ విశేషాల‌తో పాటు తాను వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్న `మేజ‌ర్‌` చిత్రానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ని వెల్ల‌డించారు.

ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌ లో చేస్తున్న `స‌ర్కారు వారి పాట‌` `పోకిరి` చిత్రాన్ని గుర్తు చేస్తుంద‌ని చెప్పారు. ఇందులో త‌న పాత్ర చాలా ఎన‌ర్జిటిక్‌ గా వుంటుంద‌ని అంతే కాకుండా చాలా ఎంటర్‌టైనింగ్‌ గా వుంటుంద‌ని తెలిపారు మ‌హేష్‌. ఇదే సంద‌ర్భంగా మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ క‌థ ఆధారంగా చేస్తున్న `మేజ‌ర్‌` గురించి చెప్ప‌మ‌ని ఎన్టీఆర్ అడిగిన‌ప్పుడు `శేషు అద్భుతంగా న‌టించాడు.

హ్యాట్సాఫ్ టు హిమ్‌. ఆ సినిమాలో నేను చాలా త‌క్కువ‌గా ఇన్‌వాల్వ్ అయ్యాను. ఒక‌టి .. రెండు రోజులు మాత్ర‌మే డిస్క‌ర్ష‌న్స్ లో పాల్గొన్నాను. ర‌షెస్ చూసిన త‌రువాత‌ చాలా గ‌ర్వంగా వుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను` అని మ‌హేష్ వెల్ల‌డించారు.

నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన మ‌హేష్ `మేజ‌ర్‌` విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నారంటే అడివి శేష్ ఏ రేంజ్‌ లో న‌టించారో అర్థం చేసుకోవ‌చ్చు అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న‌ `మేజ‌ర్‌` చిత్రం ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల కానుంది.