Begin typing your search above and press return to search.
జనతా గ్యారేజ్ ని వాడుకుంటున్న మహేష్
By: Tupaki Desk | 5 Sept 2016 10:31 AM ISTఓ సినిమా కోసం భారీ సెట్ వేస్తే.. తర్వాత ఇతర సినిమాల కోసం ఆ సెట్టింగ్ ని వాడుకోవడం చాలా కాలం నుంచే జరుగుతోంది. అప్పట్లో చిరంజీవి ముూవీ చూడాలని ఉంది కోసం కోల్కతా సెట్ ను వేస్తే.. ఆ తర్వాత ఈ సెట్ చాలా సినిమాల్లోనే దర్శనమిచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు మూవీ అర్జున్ కోసం వేసిన మధుర మీనాక్షి టెంపుల్ సెట్ పరిస్థితి కూడా ఇంతే. గుడుంబా శంకర్ కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ గా డిజైన్ చేయించిన హౌస్ సెట్ ని... ఎన్ని మూవీస్ లో ఉపయోగించారో లెక్కపెట్టడం కష్టం.
ఇప్పుడలాంటి ఫీట్ జనతా గ్యారేజ్ కూడా సాధించేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీలో గ్యారేజ్ సెట్ స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడా సెట్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఉపయోగించుకోబోతున్నాడట. మురుగదాస్ తో మహేష్ చేస్తున్న సినిమా కోసం.. జనతా గ్యారేజ్ సెట్ ని కొద్ది పాటి మార్పులతో ఉపయోగించనున్నారని తెలుస్తోంది. కీలకమైన ఫైట్ తో పాటు.. ఓ పాటను కూడా ఇందులో పిక్చరైజ్ చేయనున్నారని.. అందుకు అవసరమైన మార్పు చేర్పులను కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉన్న మహేష్ బాబు.. వచ్చీ రాగానే 6వ తేదీన చెన్నై వెళ్లిపోతున్నాడు. అక్కడ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత.. తిరిగి హైద్రాబాద్ వచ్చిన.. జనతా గ్యారేజ్ సెట్ లో షూటింగ్ చేస్తారట మహేష్ బాబు- మురుగదాస్.
