Begin typing your search above and press return to search.

ఏంటీ వార్తలు.. అని ప్రశ్నించిన సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   27 Feb 2019 11:45 AM IST
ఏంటీ వార్తలు.. అని ప్రశ్నించిన సూపర్ స్టార్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ఏప్రిల్ 25 న రిలీజ్ కావలిసి ఉంది. కానీ షూటింగ్ లో డిలే కారణంగా అనుకున్న సమయానికి విడుదల చేసే పరిస్థితిలేదని.. సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకుంటుందని గత వారం రోజులుగా ఫిలిం నగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఆలస్యానికి ఒక్కొకరు ఒక్కో కారణం చెబుతున్నారు. ఈ కారణాల సంగతేమో గానీ సినిమాను వాయిదా వేస్తున్నారనే వార్తల సంగతి మహేష్ బాబు వరకూ వెళ్ళిందట. దీంతో మహేష్ అప్సెట్ అయ్యాడట.

'మహర్షి' సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 25 నుండి మరో తేదీకి వాయిదా వేసే విషయంలో మహేష్ ఇంతవరకూ నిర్మాతలకు ఓకే చెప్పలేదట. దీంతో ఈ వార్తల విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి.. నిర్మాత దిల్ రాజుగారిని మహేష్ గట్టిగా ప్రశ్నించాడని టాక్ వినిపిస్తోంది. అసలు తనకు తెలియకుండా ఇలాంటి ఇన్ ఫర్మేషన్ ఎవరూ లీక్ చేస్తున్నారని వారిని గట్టిగా నిలదీశాడట. కష్టమైనా ఏప్రిల్ 25 కు విడుదల చేయాల్సిందేనన్న భావనలో మహేష్ ఉన్నాడట. గతంలో ఏప్రిల్ లో రిలీజ్ అయిన తన సినిమాలు ఘన విజయం సాధించడంతో మహేష్ ఈ డేట్ ను మిస్ చేసుకునేందుకు సిద్ధంగా లేడట.

ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు ఉగాది రిలీజ్ ను 'మహర్షి' మిస్ చేసుకోవడంతో నిరాశపడ్డారు. ఇప్పుడు మరోసారి 'మహర్షి' ని వాయిదా వేస్తే వారు మరింతగా అప్సెట్ అవ్వడం ఖాయం. ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి కూడా మహేష్ కు ప్రెజర్ ఎక్కువగా ఉందని సమాచారం. ఇదిలా ఉంటే 'మహర్షి' షూటింగ్ తో పాటు డబ్బింగ్ వర్క్స్ కూడా సమాంతరంగా సాగుతున్నాయట. 'మహర్షి' టీమ్ ఓవర్ టైమ్ పని చేసి అయినా ఏప్రిల్ 25 కు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.