Begin typing your search above and press return to search.

మహేష్ ను అలా విసిగించారట..!

By:  Tupaki Desk   |   7 Dec 2018 5:18 PM IST
మహేష్ ను అలా విసిగించారట..!
X
ఈరోజు తెలంగాణావ్యాప్తంగా పోలింగ్ సాగుతోంది. సాధారణ ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండే జుబ్లీ హిల్స్ లో మీడియావారు కూడా సెలబ్రిటీల విడియో బైట్స్ కోసం వేచి ఉండడం కామనే కదా. ఓటు వేయడానికి వచ్చిన సెలబ్రిటీలు కొందరు మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అయన సతీమణి నమ్రత జూబ్లీ హిల్స్ లో ఓటు వేయడానికి రాగానే మీడియా రిపోర్టర్స్ అలెర్ట్ అయ్యారు. మహేష్ వీడియో బైట్ కోసం ఎగబడిమరీ హడావుడి చేశారు. ఓటు వేసిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడు కూడా వీడియో బైట్ కోసం మహేష్ కారు ఎక్కేవరకూ వెంటబడ్డారట. పోలింగ్ బూత్ దగ్గర పెద్దగా హడావుడి ఉండదనుకున్నాడో ఏమో గానీ మహేష్ సెక్యూరిటీ స్టాఫ్ లేకుండానే వచ్చాడు. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ రిపోర్టర్ల హంగామా చూసి కాస్త అసహనంగా ఫీల్ అయ్యాడట.

ఎంతైనా సూపర్ స్టార్ కదా.. జనాలకు మీడియాకు ఆయనేం చెప్తాడో అని ఆసక్తిగా ఉంటుంది. అలా అని వారు మాట్లాడతారో లేదో చూడకుండా మీడియావారు వెంటబడితే ఎవరికైనా ఇబ్బందే కదా. ఏదేమైనా మన సెలబ్రిటీలు ఓటు వేస్తూ సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుండడం విశేషమే.