Begin typing your search above and press return to search.

సేఫ్టీగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ : మహేష్‌

By:  Tupaki Desk   |   4 Dec 2020 12:24 PM IST
సేఫ్టీగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ : మహేష్‌
X
కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలలుగా మూత పడ్డ థియేటర్లు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. హైదరాబాద్‌ లో థియేటర్ల ఓపెన్‌ కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇంకా కరోనా భయం ఉండటంతో పాటు జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే ఉద్దేశ్యంతో చాలా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ లు కూడా ఓపెన్‌ చేయడం లేదు. నేటి నుండి హైదరాబాద్‌ లోను ప్రముఖ మల్టీ ప్లెక్స్‌ అయిన ఏఎంబీ ఓపెన్‌ కాబోతుంది. పూర్తి స్థాయి సేఫ్టీ మరియు కరోనా జాగ్రత్తలతో ఓపెన్‌ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఏఎంబీ వారు ప్రకటించారు.

ఏషియన్స్‌ వారితో మహేష్‌ బాబు ఈ మల్టీప్లెక్స్‌ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇప్పటికే మహేష్‌ బాబు భార్య నమ్రత మాట్లాడుతూ ఏఎంబీ పునః ప్రారంభం కాబోతుంది.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా మహేష్‌ బాబు కూడా ఏఎంబీ లో సేఫ్టీగా సినిమాను చూసి ఎంటర్‌ టైన్‌ అవ్వండి అంటూ ట్వీట్‌ చేశాడు. ఏఎంబీ స్టాఫ్‌ మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడి కోసం వారు సేఫ్టీ ఫ్రికాషన్స్‌ తీసుకుంటున్నారు. కనుక ఎలాంటి ఆందోళన లేకుండా వచ్చి ఏఎంబీలో సినిమాను ఆస్వాదించాలంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ లో పేర్కొన్నాడు. నేడు టెంట్‌ మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు భారీగానే బుకింగ్‌ చేసుకున్నట్లుగా ఏఎంబీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.