Begin typing your search above and press return to search.

SSMB28 పై అవన్నీ ఒట్టి పుకార్లేనట..!

By:  Tupaki Desk   |   17 July 2022 11:00 AM IST
SSMB28 పై అవన్నీ ఒట్టి పుకార్లేనట..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో గతేడాది అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సోషల్ మీడియాలో తరచుగా ఏదొక రూమర్ వస్తూనే ఉంది.

త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు ఐటీ మినిస్టర్‌ గా కనిపించనున్నాడని.. ఇదొక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఒట్టి పుకారే అని.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసింది.

SSMB28 అనేది కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మహేశ్ కోసం త్రివిక్రమ్ ఒక బ్యూటీఫుల్ స్టోరీ రెడీ చేసాడు కానీ.. అందులో రాజకీయ నేపథ్యం ఉండదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మాత్రం ఉంటుంది.

అంతేకాదు ఈ సినిమాలో మహేష్‌ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' 'ఖలేజా' వంటి చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. దీంతో వీరి కాంబోలో వచ్చే హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్తుందని.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడెక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆగస్ట్ 16న SSMB28 సెట్స్ లో మహేష్ బాబు అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హాలిడే ముగించుకొని ఇండియాకి తిరిగొచ్చిన సూపర్ స్టార్.. తనయుడు గౌతమ్ ను కాలేజీలో జాయిన్ చేయడానికి లండన్ వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది.

కాగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న SSMB28 సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ నిర్వహించనుండగా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.