Begin typing your search above and press return to search.

మ‌హేశ్ తొంద‌ర ప‌డుతున్నా త్రివిక్ర‌మ్ ఎందుకిలా చేస్తున్నాడు?

By:  Tupaki Desk   |   6 May 2022 10:09 AM IST
మ‌హేశ్ తొంద‌ర ప‌డుతున్నా త్రివిక్ర‌మ్ ఎందుకిలా చేస్తున్నాడు?
X
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌`తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `గీత గోవిందం` సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మే 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబవుతోంది. విడుద‌ల‌కు ఇంకా వారం రోజులే స‌మ‌యం ఉండ‌టంతో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక‌పోతే స‌ర్కారు వారి పాట అనంత‌రం మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో ఓ మూవీ, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ మూవీ చేసేందుకు సైన్ చేశాడు.

రాజమౌళితో సినిమా అంటే ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి.. మ‌హేశ్ బాబు మొద‌ట త్రివిక్ర‌మ్ తో సినిమాను పూర్తి చేసేయాల‌ని భావించారు. మ‌హేశ్ కు ఇది 28వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతోంది. హారికా హాసిని బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం.. ఏప్రిల్ నెల‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది.

కానీ, త్రివిక్ర‌మ్ ఇంకా పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయ‌లేద‌ని.. అందుకే షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు ఏం కావాలో అవన్నీ ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. దాంతో తాను చేయ‌బోయే మరో మూడు రీమేక్ సినిమాల బాధ్యతను పవన్ త్రివిక్రమ్ కి అప్పగించారట. వాటి పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. మ‌హేశ్ బాబుతో తీయ‌బోయే సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేయ‌లేక‌పోయాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అస‌లే మ‌హేశ్ బాబు రాజ‌మౌళి సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు తొంద‌ర ప‌డుతున్నాడు. కానీ, అదేమి ప‌ట్టించుకోకుండా త్రివిక్ర‌మ్ వేరే ప‌నులు చూసుకోవ‌డంతో.. మ‌హేశ్ ఆయ‌న‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. దాంతో త్రివిక్ర‌మ్ మ‌రో నెల రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుంద‌ని, జూలై రెండో వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దామ‌ని మ‌హేశ్ కు హామీ ఇచ్చార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే `సర్కారు వారి పాట` సినిమా షూటింగ్ త‌ర్వాత ఫ్యామిలీతో కలిసి మ‌హేశ్ ఫారెన్ ట్రిప్‌కు వెళ్లార‌ని నెట్టింట వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

కాగా, మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే `అత‌డు`, `ఖ‌లేజా` చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో అత‌డు సూప‌ర్ హిట్ అవ్వ‌గా.. ఖ‌లేజా మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. కానీ, విమ‌ర్శ‌కుల నుంచి ఈ మూవీ ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో మ‌హేశ్‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ల హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై అభిమానులకు భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.