Begin typing your search above and press return to search.
మహేష్ బాబుకి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కలిసొస్తుందా...?
By: Tupaki Desk | 10 April 2020 5:15 AM GMTఅమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్, ఆహా... ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. ఇవన్నీ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్. కాలానుగుణంగా మారుతున్న మనుషులతో పాటు టెక్నాలజీ కూడా మారుతూ వస్తోంది. వాటికి ఉదాహరణే ఈ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్. వీటిలో కొన్ని ఇప్పటికే డిజిటల్ కంటెంట్ రంగంలో ప్రపంచాన్ని ఏలడం మొదలు పెట్టాయి కూడా. గ్రామీణ జనాభా ఎక్కువ ఉండే మనదేశంలో ఇవి పట్టణాల దాకా రాగలిగాయి గానీ.. గ్రామాల వరకు రీచ్ అయింది తక్కువే అని చెప్పాలి. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఈ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ప్రతీ ఇంట్లో అడుగు పెట్టేశాయి. అందుకే మన టాలీవుడ్ లోని పెద్ద హీరోలు, నిర్మాతలు వీటి వైపు చూస్తున్నారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన జనాలకి టీవీ, మొబైల్స్ లాంటివి ఎంటర్టైన్మెంట్ సాధనాలుగా మారిపోయాయి. ప్రజెంట్ జనరేషన్ లో అందరూ టీవీల కంటే కొత్తగా వస్తున్న డిజిటల్ కంటెంట్ వైపే మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా మొబైల్ అనేది మానవుడి కనీస అవసరంగా మారిపోయింది. దీంతో ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రతీ మొబైల్ లో దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే థియేటర్స్ కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఈ ఓటీటీ యాప్స్ ద్వారా చూసేయొచ్చు. విడుదలైన సినిమా కనీసం వారం రోజుల్లో ఓటీజీ ప్లాట్ ఫార్మ్ లో దర్శనమిస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లో వీటిల్లో ప్రసారం అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు నెల రోజులు కాదు డైరెక్ట్ సినిమా రిలీజ్ వీటి ద్వారా చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయి.
ఈ ఓటీజీ ప్లాట్ ఫార్మ్ కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్.. అబ్బో ఒకటేమిటి ఎన్నైనా చూసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. కరోనా ప్రభావంతో థియేటర్స్ మూత పడతంతో వినోదం కోసం ఈ అహ, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్‌లకు ఫుల్ గిరాకీ వచ్చింది. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులు, పాత క్రికెట్ మ్యాచ్‌లు, సినిమా పాటలు.. ఇలా అన్ని వినోద కార్యక్రమాలు ఇందులో వస్తుండటంతో వీటి మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో మొబైల్ యాప్ యుగం నడుస్తున్న తరుణం లో భవిష్యత్తు ఓటీటీ యాప్స్‌దే అని గుర్తించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా 'ఆహా' ద్వారా ఈ ఓటీటీ రంగంలోకి దిగాడు. ఇప్పుడు లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ఓటీజీ ప్లాట్ ఫార్మ్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడని సమాచారం.
టాలీవుడ్ లో ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో సినిమాలతో పాటు బిజినెస్ గురించి కూడా ఆలోచించే ఏకైక హీరో మహేష్. ఇక రాబోయే రోజుల్లో ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ దే రాజ్యమని భావించిన మహేష్.. జియో అండ్ రిలయన్స్ లతో కలిసి ఒక ఓటీటీ యాప్ డెవలప్ చేయబోతున్నారట. కానీ దీంట్లో అడుగు పెట్టబోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తెలుగులో పెద్దగా ఎక్కడం లేదు. ఇక్కడ ఓటీటీ యాప్స్ చూసే తెలుగు ప్రేక్షకులు కూడా నెట్ ఫ్లిక్స్ రేంజ్ కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు కానీ మన లోకల్ కంటెంట్ వైపు దృష్టి పెట్టడం లేదు. అందుకే మన తెలుగు యాప్ 'ఆహా' అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేక పోయిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇలాంటి టైమ్ లో మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.