Begin typing your search above and press return to search.
అప్పుడు పవన్ కోసం ఇప్పుడు చిరు కోసం మహేష్..!
By: Tupaki Desk | 15 Oct 2020 6:00 AM GMTపవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు త్రివిక్రమ్ కోరిక మేరకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెల్సిందే. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో జల్సా స్థాయి మరింతగా పెరింది. అప్పట్లో అదో సంచలనంగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేయడంతో పాటు చాలా విభిన్నంగా కథను ప్రారంభించేందుకు గాను మహేష్ బాబు వాయిస్ ను దర్శకుడు త్రివిక్రమ్ ఉపయోగించుకున్నాడు. అలాగే పబ్లిసిటీ పరంగా కూడా చాలా ఉపయోగపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ మళ్లీ తన వాయిస్ ను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈసారి చిరంజీవి ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నాడట.
ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ కు శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను చిత్రాలను ఇచ్చిన కొరటాల శివ కోసం ఆచార్య సినిమా కోసం వాయిస్ ఇచ్చేందుకు ఓకే అన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆచార్యలో గెస్ట్ రోల్ లో మహేష్ నటించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు వాయిస్ తో ఆచార్య లో వినిపించబోతున్నాడు. సినిమా కథను మహేష్ తో పరిచయం చేయించడం ద్వారా మరింతగా పబ్లిసిటీ తీసుకు రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచడంలో ఉపయోపడుతుందని కొరటాల భావిస్తున్నాడట.
ఇప్పటికే రెండు సినిమాలు చేసిన మహేష్ బాబు.. కొరటాలలు ముందు ముందు మరో సినిమాను కూడా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఇద్దరి మద్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుకలో చిరంజీవి పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ కారణంగా కూడా ఆచార్యకు వాయిస్ ఇచ్చేందుకు మహేష్ ఓకే చెప్పి ఉంటాడు అంటున్నారు. అసలు విషయం ఏది అయినా ఆచార్యలో మహేష్ వాయిస్ ఉంటే ఖచ్చితంగా హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం.