Begin typing your search above and press return to search.
అనుష్క ఫోన్ కొట్టేసిన మహేష్
By: Tupaki Desk | 2 Aug 2015 10:10 AM GMTఅందాల కథానాయిక అనుష్క ఉపయోగించే మొబైల్ ఏది? ఏమో .. ఏ ఫోన్ ఉపయోగించినా తను ప్రచారం చేసే బ్రాండ్ మాత్రం ఇంటెక్స్ మొబైల్స్. అయితే ఇంటెక్స్ తో అనుష్క కాంట్రాక్ట్ ఇటీవలే ముగిసింది. దాంతో కొత్త ముఖాన్ని కస్టమర్ల కు పరిచయం చేయాలని భావించిన సదరు కంపెనీ ఈసారి ప్రిన్స్ మహేష్ తో డీల్ కుదుర్చుకుంది. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో వాణిజ్య ప్రకటనను రూపొందించారు. ఇక నుంచి ప్రకటనలో మహేష్ హల్ చల్ చేస్తాడు. అంటే అనుష్క ఇంటెక్స్ ఫోన్ ని మహేష్ కొట్టేసినట్టే కదా!
అలాగే తమిళనాడులో ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ ప్రమోటర్ గా సూర్య ఎంపికయ్యాడు. ఇక్కడ మహేష్ బ్రాండ్ వాల్యూ పెంచే పని పెట్టుకుంటే, అక్కడ సూర్య ఆ పని చేపట్టాడు. ఇంటెక్స్ మొబైల్స్ ఐడియా కంపెనీకి అనుబంధ కంపెనీ. .. కాబట్టి మహేష్ ముఖంతో ఈ బ్రాండ్ ఇప్పుడు మరింత పాపులారిటీ పెంచుకుంటోంది.
అయితే మార్కెట్లో నాణ్యమైన ఫోన్ ఏది? అనేది తెలుసుకోవడం కస్టమర్ కి సవాల్ గా మారింది? ఏ ఫోన్ లో ఏ ఫీచర్స్ ఉంటాయి? అవి ఎంత సమర్థంగా పనిచేస్తాయి? అన్నది ఎవరికీ తెలీని పరిస్థితి. ఏదో అభిమాన హీరో కనిపించాడని ఫోన్ కొనేస్తే అంతే సంగతి. ఇప్పటివరకూ నోకియా, శాంసంగ్, ఐ ఫోన్ లను కొట్టేసే ఫోన్ లు వేరే ఏవీ మార్కెట్లోకి రాలేదు. వచ్చినా నిలబడలేదు. మహేష్ ప్రమోషన్ తో ఇంటెక్స్ ఆ రేంజు పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.