Begin typing your search above and press return to search.

సిల్లి ఫెలోస్ కోసం మహేష్ వస్తాడట

By:  Tupaki Desk   |   15 Jun 2018 8:19 AM GMT
సిల్లి ఫెలోస్ కోసం మహేష్ వస్తాడట
X
టాలీవుడ్ లో మన స్టార్ హీరోలు ప్రవర్తిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటోంది. అభిమానులు కూడా అందరూ హీరోలు ఒకటే అనే ఆలోచనకు వస్తున్నారు. సాధారణంగా ఎంతో సాన్నిహిత్యం ఉంటే తప్ప ఒకప్పుడు ఇతర సినిమాల వేడుకలకు హీరోలు వచ్చేవారు కాదు. కాని ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. స్టార్ హీరోలు అందరు చాలా ఫ్రెండ్లి గా తిరిగేస్తున్నారు. అంతే కాకుండా ఒకే తెరపై కనిపించి మల్టీస్టారర్ లకు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడే మహేష్ ఒక మంచి మాట చెప్పాడు. ఇప్పటి నుంచి మహేష్ అందరూ హీరోలు అందరి ఫంక్షన్లకు వెళతారు అని చెప్పడంతో సరికొత్తగా అనిపించింది. ఇక సూపర్ స్టార్ తను చెప్పినట్టుగానే ఆ పనిని ఆచరణలో పెట్టడానికి సిద్ధమయ్యాడు. నెక్స్ట్ అల్లరి నరేష్ సినిమాకు సంబంధించిన వేడుకకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అల్లరి నరేష్ మహేష్ 25వ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి మధ్య స్నేహం పెరిగింది.

ఇక అల్లరి నరేష్ సిల్లి ఫెలోస్ సినిమా త్వరలో విడుదల కానుంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో సునీల్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా పాజిటివ్ రిజల్ట్ అల్లరోడికి చాలా అవసరం. సుడిగాడు దర్శకుడు భిమానేని శ్రీనివాసరావు సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే మహేష్ క్రేజ్ కాస్త సినిమాకు తగిలిస్తే బావుంటుందని నరేష్ మహేష్ ని సిల్లి ఫెలోస్ వేడుకకి రమ్మని అడిగారట. నరేష్ అడిగిన వెంటనే మహేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.