Begin typing your search above and press return to search.

'థ్యాంక్స్ టు ట్వీపుల్' అంటోన్న ప్రిన్స్!

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:40 AM GMT
థ్యాంక్స్ టు ట్వీపుల్ అంటోన్న ప్రిన్స్!
X
టాలీవుడ్ సూప‌ర్‌ స్టార్ - ప్రిన్స్ మ‌హేష్ బాబు ట్విటర్ లోకి అడుగుపెట్టిన‌ 8 ఏళ్లలోనే 70 లక్షల ఫాలోవర్లు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. సౌత్ ఇండియా వ‌ర‌కు ట్విట‌ర్ లో టాప్ ఫాలోవర్లను కలిగిన సినీ హీరోల్లో ఈ రాజ‌కుమారుడు ఒక‌డిగా నిలిచాడు. త‌న‌కు ట్విట‌ర్ లో ఫాలోవ‌ర్లు పెరిగిపోవ‌డంపై మ‌హేష్ స్పందించాడు. త‌న‌కు ఈ ఘ‌న‌త తెచ్చిపెట్టిన అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ మ‌హేష్ ట్వీట్ చేశాడు. అభిమానుల ఆదరణకు ఎప్పుడూ రుణపడి ఉంటాన‌ని, .... లవ్ యు ఆల్ అని ప్రిన్స్ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్స్ టు ట్వీపుల్’ అని సంతకం పెట్టిన తన ఫొటోను షేర్ చేశాడు. `7మిలియన్ మహేషియన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ ను పెట్టాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

వాస్త‌వానికి సోష‌ల్ మీడియా ఖాతా తెరిచిన మొద‌ట్లో మ‌హేష్....పెద్ద‌గా యాక్టివ్ గా ఉండేవాడు కాదు. అయితే, ట్విట‌ర్ లో అడుగుపెట్టిన త‌ర్వాత మ‌హేష్....త‌న‌ అభిమానుల‌తో ఎప్ప‌టిక‌పుడు ట‌చ్ లో ఉంటున్నాడు. తన ఫ్యామిలీ - సినిమాలు - వెకేష‌న్ ల‌కు సంబంధించిన విషయాలను ట్విట‌ర్ లో షేర్ చేస్తున్నాడు. దీంతో, ట్విట‌ర్ లో ప్రిన్స్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ...అందులోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే మహేష్ ట్విటర్ ఫాలోయర్స్ సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ‘మహర్షి’ సినిమా షూటింగ్ లో మ‌హేష్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.