Begin typing your search above and press return to search.
మే 27.. లాంగ్ వీకెండ్ మీద కన్నేశారా?
By: Tupaki Desk | 25 April 2016 5:30 PM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ పై చాలానే గందరగోళం ఉంది. ఆడియో విడుదలను రెండు సార్లు పోస్ట్ పోన్ చేయడంతో.. అసలు మూవీ రిలీజ్ ఎప్పుడో అర్ధం కాక అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే.. ఇప్పటికే మహేష్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేశాడని తెలుస్తోంది.
మే 27.. ఇదే రోజును బ్రహ్మోత్సవం విడుదలకు సెట్ చేశారు. మే 13 అని, 20 అని ఇలా రెండు మూడు డేట్స్ వినిపించినా.. చివరకు మే 27కే మొగ్గింది బ్రహ్మోత్సవం యూనిట్. దీనికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. మే 30 సోమవారం నాడు యూఎస్ లో హాలిడే. మెమోరియల్ డే సందర్భంగా ఆ రోజున సెలవు ఇస్తారు. న్యూ ఇయర్ తర్వాత.. యూఎస్ లో ఇదే లాంగ్ వీకెండ్. శుక్రవారం నుంచి సోమవారం వరకూ కలెక్షన్స్ ఇరగదీసేయచ్చు. ఇక్కడ సంక్రాంతిని ఎంత ఇంపార్టెంట్ పండుగ అంటారో.. అక్కడ మెమోరియల్ డే సెలబ్రేషన్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. అందుకే ఈ డేట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడు మహేష్.
మే 27నుంచి రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో హాలిడేస్ ఉంటాయి. ఆ తేదీకి మొగ్గడానికి ఇది కూడా కారణమే అంటున్నారు. యూఎస్ లో బ్రహ్మోత్సవాన్ని 13 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఇది బ్రేకీవెన్ కు రావాలంటే 3 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. సినిమా టాక్ బాగుంటే వీకెండ్ లోనే 2మిలియన్ డాలర్లు వసూలు చేసే ఛాన్స్ మహేష్ బ్రహ్మోత్సవంకి ఉందంటున్నారు.