Begin typing your search above and press return to search.

ఈ వారంలో మహేష్ తేల్చేస్తాడట

By:  Tupaki Desk   |   29 Jan 2019 11:59 AM IST
ఈ వారంలో మహేష్ తేల్చేస్తాడట
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నిరోజులుగా 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈమధ్యే పొల్లాచి షెడ్యూల్.. మధ్యలో కొన్ని రోజులు ముంబైలో కూడా షూటింగ్ పూర్తి చేసిన మహేష్ రీసెంట్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. షూటింగుల నుండి ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్న ఈ వారం రోజుల్లో మహేష్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నాడని సమాచారం.

సుకుమార్ ప్రాజెక్ట్ తో పాటుగా మహేష్ యువ దర్శకులతో వరసగా బ్యాక్ టూ బ్యాక్ ఫిలిమ్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ వారం రోజులపాటు యువదర్శకులు చెప్పే స్టొరీ లైన్స్ వినడం.. ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ లు తీసుకొస్తే వాటిని డిస్కస్ చేయడంలో బిజీ గా ఉంటాడట. మొదటగా సుకుమార్ రెడీ చేసిన స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతాయని.. ఆ తర్వాత సందీప్ వంగా.. అనిల్ రావిపూడి మహేష్ కు కథలు వినిపిస్తారని అంటున్నారు. వీరే కాకుండా ఇంకా యువ దర్శకులు తీసుకొచ్చే స్క్రిప్ట్ ల కోసం మహేష్ ఎదురు చూస్తున్నాడట. మహేష్ ను కనుక ఎగ్జైట్ చేసే కథను తీసుకువస్తే వారికి మహేష్ ను దర్శకత్వం వహించే అవకాశం లభిస్తుందని అంటున్నారు.

అంటే మరో రెండు వారాల్లో మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. మరి సుకుమార్ సినిమా తర్వాత మహేష్ ను డైరెక్ట్ చేస్తే లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో వేచి చూడాలి.