Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' కి మహేష్ బాబు సపోర్ట్..!

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:30 AM GMT
లవ్ స్టోరీ కి మహేష్ బాబు సపోర్ట్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి కంటెంట్ తో రూపొందే సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రచార చిత్రాలను రిలీజ్ చేస్తూ తన వంతు సపోర్ట్ ఇస్తుంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా చూపకుండా ప్రతీ మంచి చిత్రాన్ని అభినందిస్తుంటారు. టీజర్ - ట్రైలర్ లేదా సాంగ్స్.. ఏది నచ్చినా సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా ''లవ్ స్టోరీ'' సినిమా ట్రైలర్ మెచ్చుకుంటూ మహేష్ ట్వీట్ చేశారు.

అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''లవ్ స్టొరీ''. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా సక్సెస్ మొత్తం సినిమా పరిశ్రమకు చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి రాబోయే పెద్ద సినిమా ఇది. ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తే మరిన్ని చిత్రాలు థియేటర్లకు క్యూ కడతాయి.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు 'లవ్ స్టొరీ' సినిమాకు అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన మహేష్.. "డ్యాన్స్ మీద కేంద్రీకృతమైన సినిమా ఇది. తెలుగులో ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. 'లవ్ స్టోరీ' టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అని పేర్కొన్నారు. ఇంతకుముందు ఈ చిత్రంలోని ఓ పాటను కూడా మహేష్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే 'లవ్ స్టొరీ' సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు పెద్ద హిట్ అవ్వడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్లుగానే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చగా.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని - ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.