Begin typing your search above and press return to search.

సుకుమార్‌ కు పెద్ద పని పెట్టిన మహేష్‌!!

By:  Tupaki Desk   |   28 Aug 2018 8:29 AM GMT
సుకుమార్‌ కు పెద్ద పని పెట్టిన మహేష్‌!!
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘మహర్షి’ సెట్స్‌ పై ఉండగానే సుకుమార్‌ దర్శకత్వంలో తన 26వ చిత్రాన్ని చేసేందుకు మహేష్‌ బాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘1 నేనొక్కడినే’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కాని ఆ చిత్రం స్క్రీన్‌ ప్లే పరంగా సుకుమార్‌ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే మహేష్‌ బాబుకు కూడా ఆ సినిమా బాగా నచ్చింది. అందుకే అప్పుడే మరో సినిమాను సుకుమార్‌ తో చేయాలని మహేష్‌ బాబు భావించాడు.

తాజాగా ‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ ను సుకుమార్‌ అందుకున్నాడు. 1980 నేపథ్యంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం టాలీవుడ్‌ టాప్‌ 3లో చేరిపోయింది. గత వేసవిలో విడుదలైన రంగస్థలం సంచలన విజయాన్ని నమోదు చేయడంతో వెంటనే మహేష్‌ బాబు తన తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు డేట్లు ఇచ్చేశాడు. రంగస్థలం చిత్రం తరహాలోనే మహేష్‌ బాబుకు కూడా ఒక పీరియాడిక్‌ కథాంశంను వినిపించాడు. కథ నచ్చడంతో స్క్రిప్ట్‌ పూర్తి చేయాల్సిందిగా సుకుమార్‌ కు మహేష్‌ సూచించడం జరిగింది.

సుకుమార్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌ సిద్దం చేస్తున్న సమయంలో మహేష్‌ బాబు షాకిచ్చాడు. ప్రస్తుతం పలు బయోపిక్‌ లు తెరకెక్కడంతో పాటు - ఎన్నో పీరియాడిక్‌ చిత్రాలు వస్తున్నాయి. వాటితో పాటు మన చిత్రం కూడా పీరియాడిక్‌ చిత్రం అయితే బాగోదేమో అని - మరో స్టోరీని సిద్దం చేయాల్సిందిగా సుకుమార్‌ కు సూచించాడు. దాంతో సుకుమార్‌ తన వద్ద ఉన్న ఈ జనరేషన్‌ కు సంబంధించిన ఒక ఆసక్తికర స్టోరీలైన్‌ ను వినిపించడం జరిగింది. ఆ స్టోరీకి మహేష్‌ ఓకే చెప్పడంతో మళ్లీ స్క్రిప్ట్‌ వర్క్‌ మొదటి నుండి మొదలు అయ్యింది. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలోనే సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. పీరియాడిక్‌ చిత్రం అంటే సాహస నిర్ణయం. ప్రస్తుత పరిస్థితుల్లో సాహస నిర్ణయం, ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకోవడం తన వల్ల కాదు అని మహేష్‌ బాబు భావిస్తున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.