Begin typing your search above and press return to search.

మహేష్ ఫోటోలు మళ్లీ లీక్ అయ్యాయ్

By:  Tupaki Desk   |   14 Nov 2016 4:22 AM GMT
మహేష్ ఫోటోలు మళ్లీ లీక్ అయ్యాయ్
X
మహేష్ బాబు.. మురుగదాస్ కాంబినేషన్ లో బైలింగ్యువల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఏజెంట్ శివ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఇంకా తాము ఫస్ట్ లుక్ ఇవ్వకుండానే.. పటిష్టమైన చర్యలకు కేంద్రం సిద్ధమని.. చెప్పిన దర్శకుడు మురుగదాస్ అక్కడి నుంచ కాసింత సెక్యూరిటీ పెంచేశాడు.

ఇప్పుడు సడెన్ గా మహేష్ బాబు కొత్త స్టిల్స్ నెట్ లో దర్శనమిచ్చేశాయి. ఒకటీ అరా కాదు.. ఓ బంచ్ నోట్లోకి తిరిగేస్తున్నాయంతే. మహేష్ బాబు బస్ లోంచి దిగి వచ్చి.. అక్కడ ఉన్న వారందిరినీ విష్ చేసి వెళ్లిపోవడం కనిపిస్తుంది. మురుగదాస్ సినిమాలో మహేష్ లుక్ ఇప్పటికే తెలిసిపోయినా.. ఈ సారి మరింత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ట్రైచేశాడు. క్లాస్ గా కనిపిస్తున్నా.. మాస్ ను ఒప్పించేందుకు తగినంతగా కష్టపడ్డ దర్శకుడు మహేష్ గెటప్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడనే సంగతి అర్ధమవుతుంది.

అయితే.. ఫస్ట్ లుక్ కూడా ఇంకా రిలీజ్ కాకుండానే.. ఇలా ఇంత క్లోజప్ షాట్స్ రావడంపై మాత్రం కొందరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మహేష్ కొత్తగా కనిపించడం హ్యాపీనెస్ ఇస్తున్నా.. ఇలా లీకుల వాటితో కావడంతో తెగ వర్రీ అయిపోతున్నారు.'

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/