Begin typing your search above and press return to search.

మహేష్‌ కోసం ఇంత హెవీగా ఎందుకు?

By:  Tupaki Desk   |   14 April 2015 5:00 AM IST
మహేష్‌ కోసం ఇంత హెవీగా ఎందుకు?
X
సూపర్‌స్టార్‌ మహేష్‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు అంటే అందరి కళ్లు అటువైపే ఉంటాయి. అందులో ఎవరెవరు నటిస్తున్నారు? దర్శకుడెవరు? నిర్మాత ఎవరు? ఇలా ఆరాలు సీరియస్‌గానే సాగుతాయి. సూపర్‌స్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోకి అన్నీ చిత్రవిచిత్ర పాత్రలు వచ్చి చేరుతున్నారు. నటించేవాళ్లంతా వెరైటీనే.

పెద్దరికం, భారతీయుడు చిత్రాలతో తెలుగు తెరకి సుపరిచితమైన సున్య ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతిబాబు కీరోల్‌ పోషిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌ వచ్చి చేరాడు. అంతెందుకు బుల్లితెరపై చిట్టి పొట్టి నిక్కర్లతో, పొట్టి గౌనుతో కుర్రాళ్ల గుండెల్లో నిదురోయే యాంకర్‌ అనసూయ సైతం ఈ సినిమాలో ఓ పాత్రలో నటించేస్తోందని టాక్‌. మరీ ఇంతమందా? ఇన్ని కొత్త క్యారెక్టర్లా? బాబోయ్‌! అని జనాలు కన్ఫ్యూజ్‌ అయిపోతున్న ఈ టైమ్‌లో అంగనా రాయ్‌ అనే కొత్త క్యారెక్టర్‌ లేటెస్టుగా వచ్చి చేరింది. ఇకముందు ఇంకెన్ని పాత్రలు వచ్చి చేరతాయి? అసలేం జరుగుతోంది? అని జనాలంతా తెగ కన్ఫ్యూజ్‌ అయిపోతున్నారు.

భోజనం టేబుల్‌ మీద ఆకులో బూరె, వడ, జాంగ్రీ, మైసూర్‌ బజ్జీ, జిలేబీ, రసగుల్ల, పులిహోరా, దద్దోజనం, వైట్‌ రైస్‌, బిర్యానీ, వంకాయ్‌, ఠెంకాయ్‌ .. ఇన్ని రకాలు ఉంటే తినేవాడి పరిస్థితి ఏమవుతుంది. తొలి ముద్దయినా దిగకముందే బ్రావ్‌మని తేన్చడూ? ఇప్పుడు మహేష్‌ సినిమా చూసినా అదే పరిస్థితి వస్తుందేమో! ఆల్రెడీ సన్‌ ఆఫ్‌ సత్యమూర్తిది ఇదే పరిస్థితి. కాస్త ఆలోచించండి గురూ!