Begin typing your search above and press return to search.

మహేష్ బాబుకు ఫిట్టింగ్ ఎట్టేశాడుగా..

By:  Tupaki Desk   |   5 May 2017 11:15 AM GMT
మహేష్ బాబుకు ఫిట్టింగ్ ఎట్టేశాడుగా..
X
మన హీరోలందరూ పొరుగు రాష్ట్రాల మార్కెట్లపై కన్నేస్తున్నారు ఈ మధ్య. ఇందుకోసం ద్విభాషా.. త్రిభాషా చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. అల్లు అర్జున్ తన ప్రమేయం లేకుండానే కేరళలో మంచి మార్కెట్ సంపాదిస్తే.. ‘బాహుబలి’ దెబ్బకు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. తమిళ నాట కాలు మోపాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘స్పైడర్’తో ఆ ఆశ నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాషల్లో వేర్వేరుగా తెరకెక్కుతోంది. మురుగదాస్ ఉన్నాడు కాబట్టి తనకు బాగానే కలిసొస్తుందని మహేష్ ఆశతో ఉన్నాడు. తనకు కోలీవుడ్లో మంచి ఆరంభం దక్కుతుందని అనుకున్నాడు.

కానీ మహేష్ ఆశలకు బ్రేకులేస్తూ అజిత్ సినిమా ‘వివేగం’.. ‘స్పైడర్’కు అడ్డం పడబోతోంది. ముందు అనుకున్నట్లు జూన్ 23న కాకుండా ‘స్పైడర్’ ఆగస్టు 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ డేట్ కన్ఫమ్ చేసే సమయానికి విక్రమ్ మూవీ ‘ధృవ నక్షత్రం’ తప్ప వేరే పోటీ ఏమీ లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ‘వివేగం’ కూడా ఇండిపెండెన్స్ డే వీకెండ్లోనూ రిలీజవుతుందట. ఇది కచ్చితంగా మహేష్ మూవీకి ఎదురు దెబ్బే. అజిత్ సినిమా అంటే తమిళనాట హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ అతను వరుస హిట్లతో ఊపుమీదున్నాడు. ‘వివేగం’ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మహేష్ సినిమాను ఏమాత్రం పట్టించుకుంటారో అన్న సందేహాలున్నాయి. మరి మహేష్ ను మురుగదాస్ ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/