Begin typing your search above and press return to search.

ఆ ఘనత మహేష్ బాబు సినిమాకే!

By:  Tupaki Desk   |   27 Aug 2018 9:50 AM GMT
ఆ ఘనత మహేష్ బాబు సినిమాకే!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో తీపి గుర్తుల్లాంటి బ్లాక్ బస్టర్లతోపాటు చేదుమాత్రల్లాంటి డిజాస్టర్లకు ఏమాత్రం కొదవలేదు. డిజాస్టర్ల విషయమే తీసుకుంటే భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఏమాత్రం అంచనాలు అందుకోలేక చతికిల పడిన 'స్పైడర్' దాదాపు మహేష్ కెరీర్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆ విషయంలోనే కాదు మరో విషయంలో ఇంకో ఫస్ట్ కానుంది.

డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ - హాట్ స్టార్ ఈ జెనరేషన్ ప్రేక్షకులకు పరిచయమే. అలంటిదే నెట్ ఫ్లిక్స్ కూడా. ప్రపంచంలో అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ వారు 'స్పైడర్' ను రేపటినుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతారట. ఇదేమీ గొప్ప విషయం కాదు అని మీరనుకంటే పొరపాటే. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్న మొట్ట మొదటి తెలుగు సినిమా ఇదే.

ఈ సినిమా అసలే అందరికీ షాకిచ్చింది. ఆఖరికి టీవీ లో టెలికాస్ట్ చేస్తే కూడా పెద్దగా స్పందన లేదు. మరి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత కనుక మంచి రెస్పాన్స్ వస్తే అది మహేష్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయమే. మహేష్ వి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉంటే ఏరి కోరి ఈ 'స్పైడర్' ను కొని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచమని ఆ నెట్ ఫ్లిక్స్ వారికి చెప్పిందెవరో..!