Begin typing your search above and press return to search.

ఉన్నదే ఐదారుగురు హీరోలం : మహేష్

By:  Tupaki Desk   |   7 April 2018 5:49 PM GMT
ఉన్నదే ఐదారుగురు హీరోలం : మహేష్
X
భరత్ అనే నేను ఫంక్షన్ లో హీరో మహేష్ బాబు బాగా ఓపెన్ అయిపోయాడు. తారక్ స్పీచ్ తర్వాత మైక్ అందుకున్న మహేష్ ముఖ్యంగా ఇండస్ట్రీ పోకడ గురించి అభిమానుల తీరు గురించి అతి తక్కువ మాటల్లో చెప్పిన తీరుకు అభిమానుల నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంశలు దక్కుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్నదే ఐదారుగురు హీరోలమని ఏడాదికి మహా అయితే ఒక సినిమాకు మించి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అందరు కలిసుండాలని కోరుకుంటానని చెప్పాడు. మేము మేము బాగానే ఉంటాం మీరే ఇంకా బాగా ఉండాలని' ఫాన్స్ మధ్య విభేదాల గురించి ట్రాలింగ్ చేసుకుంటున్న వైనం గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించిన ప్రిన్స్ కౌంటర్ మాత్రం నేరుగానే వేసాడు. మీరు ఇంకా బాగుండాలి అని అభిమానుల వైపే సూటిగా చూస్తూ చెప్పేసాడు.

ముసుగులో గుద్దులాట లేకుండా మహేష్ చెప్పిన తీరు నిజంగా అభినందనీయం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ లేనిపోని డాబులకు పోతున్న వైనం గురించి ప్రస్తావించి మంచి పనే చేసాడు. తారక్ ను ఇలా పబ్లిక్ ఫంక్షన్ లో కలుసుకోవడం ఇదే మొదటి సారి కాదని గతంలో ఆది ఆడియో రిలీజ్ కు తాను గెస్ట్ గా వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు మహేష్. తారక్ తనను అన్నా అన్న పిలుపుకి మహేష్ సైతం తమ్ముడు అంటూ తన ప్రసంగంలో స్పందించడం చక్కన్ని ఆరోగ్యకరమైన పోటీకి మొదటి అడుగుగా ఆహుతులకు అనిపించింది. సినిమా గురించి కంటే ముందుగా ఈ టాపిక్ తీసుకుని మహేష్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

భరత్ అనే నేను విడుదల కాబోతున్న ఏప్రిల్ 20 తన తల్లి పుట్టిన రోజని అదే రోజు తామందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా రిలీజ్ కావడం గురించి కూడా చెబుతూ అమ్మ ఆశీసులు ఉంటాయని తప్పకుండ విజయం సాధిస్తుందని చెప్పి ముగించిన మహేష్ స్పీచ్ మొదట్లో కృష్ణ గారి అబ్బాయినైన నేను అని మొదలుపెట్టడం తమ్ముడు తారక్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడం ఇద్దరు హీరోల ఫాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది