Begin typing your search above and press return to search.

శివరాత్రికి మహేష్ స్పెషల్ గిఫ్ట్

By:  Tupaki Desk   |   19 Jan 2019 11:10 AM GMT
శివరాత్రికి మహేష్ స్పెషల్ గిఫ్ట్
X
అంతా సవ్యంగా జరిగితే మహేష్ బాబు మహర్షి ఏప్రిల్ 5న థియేటర్లలో అడుగు పెట్టేది. కానీ ఇప్పుడు వాయిదా తప్పలేదు. ఏప్రిల్ చివరి వారం అంటూ ఒక వార్త లేదు జూన్ లోనే అంటూ మరో న్యూస్ ఇలా రకరకాలుగా ప్రచారం మొదలైపోయింది. దీనికి సంబంధించిన క్లారిటీ రావడానికి ఇంకా టైం పడుతుంది కానీ ఈ లోపు నిరాశ చెందిన మహేష్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ అవుతున్నట్టు తెలిసింది. అది కూడా శివరాత్రి పర్వదినమైన మార్చి 4వ తేదీన.

గతంలో ఓ చిన్న టీజర్ రూపంలో మహేష్ లుక్ తో పాటు నడకను వదిలిన యూనిట్ ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమయ్యేలా మరో స్పెషల్ టీజర్ ను కట్ చేస్తున్నారట. ఇందులో మహేష్ ట్రేడ్ మార్క్ షాట్స్ తో పాటు ఊహించని కొన్ని స్పెషల్ థ్రిల్స్ ఉంటాయని తెలుస్తోంది. అయితే అవేంటి అనేది లీక్ చేయటం లేదు మహర్షి టీమ్. పొలాచ్చిలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న మహర్షి అది పూర్తి కాగానే తర్వాత పాటల షూట్ ప్లాన్ చేసుకోబోతున్నాడు. పూజా హెగ్డే తో రెండు డ్యూయెట్స్ మొదట తీస్తారని తెలిసింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కీలకమైన పాత్ర చేస్తున్న అల్లరి నరేష్ మరో ఆకర్షణగా నిలుస్తున్నాడు. దిల్ రాజు-అశ్వినీదత్-పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి మీద సుమారు వంద కోట్లకు పైగా బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. శాటిలైట్ పరంగా కూడా సంచలనాలు నమోదు చేసేలా కనిపిస్తున్న మహర్షి రిలీజ్ డేట్ మారోసారి పక్కాగా ప్రకటిస్తే అభిమానులకు ఓ పెద్ద టెన్షన్ తీరిపోతుంది