Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ వెనుక చాలా రహస్యాలున్నాయి
By: Tupaki Desk | 9 Nov 2020 3:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ గురించి అభిమానులకు తెలిసినది ఎంత? అన్ని రహస్యాలు ఓపెన్ గా తెలిసినవేనా? అంటే.. తెలిసింది గోరంత.. తెలియనిది గోరంత అనడంలో ఎలాంటి సందేహం లేదు. వృత్తిగత విషయాల గురించి తెలిసినంత వ్యక్తిగత వ్యవహారాలు తెలియాలన్న రూలేమీ లేదు.
అయితే అతడి గుట్టంతా ఓపెన్ చేసేస్తానని అంటున్నారు ఆయన సోదరి ఘట్టమనేని మంజుల. తాజా ఇంటర్వ్యూలో ``నేను మహేష్ రహస్యాలు మొత్తం వెల్లడిస్తాన``ని సోదరి మంజుల చెప్పారు
హీరో మహేష్ సోదరి మంజుల నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు. మహేష్ ఇన్ స్టాగ్రామ్ లో తన సోదరికి ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలు తెలిపారు. మంజుల వెబ్ సైట్ ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ వెబ్ సైట్ లో మంజుల స్వయంగా క్యూరేట్ చేసిన అందం సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తుంది.
తాజా మీడియా ఇంటర్వ్యూలో మహేష్ తో తనకున్న అనుబంధం గురించి మంజుల ఓపెన్ గా ప్రతిదీ మాట్లాడారు. మహేష్ తనకన్నా పరిణతి చెందినవాడని.., అతను తరచూ తనకు మార్గనిర్దేశం చేస్తాడని .. సలహాలు ఇస్తాడని ఆమె అన్నారు.
తన అభిమానులకు మహేష్ సూపర్ స్టార్ అని మంజుల అన్నారు. అయితే.. సూపర్ స్టార్ వెనుక చాలా రహస్యాలు ఉన్నాయి. ఆయన రహస్యాలు అన్నీ త్వరలో వెల్లడిస్తాను అని మంజుల అన్నారు. ఇంతకీ అభిమానులకు తెలియని అన్ని రహస్యాల్ని మంజుల చెప్పేస్తారా? వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి రహస్యాలు చెబుతారు? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.