Begin typing your search above and press return to search.
హీరోగా మహేష్ మేనల్లుడు
By: Tupaki Desk | 27 Nov 2017 4:16 AM GMTసినీరంగంలోకి వారసులు ప్రవేశించడం కొత్తేమీ కాదు. తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల ఫ్యామిలీలో ఎక్కువమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వస్తే తక్కువ మంది హీరోలు వచ్చింది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీలో సూపర్ స్టార్ మహేష్.. సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్నారు. మహేష్ సోదరి మంజుల ఒకటి రెండు సినిమాల్లో నటించి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు.
తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రంగప్రవేశం చేయబోతున్నాడు. మహేష్ బావ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ తన మామయ్యలాగా సినిమా రంగంలో రాణించాలని ఆశ పడుతున్నాడు. దాంతో హీరో అయ్యేందుకు అవసరమైన అంశాల్లో అశోక్ కు చాలా రోజుల ముందే ట్రైనింగ్ మొదలెట్టేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైనింగ్ అంతా ఓ కొలిక్కి రావడంతో అతడిని హీరోగా లాంచ్ చేసే పనులు మొదలెట్టారు. పెద్ద ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు అశోక్ ను లాంచ్ చేసే బాధ్యతలు అప్పగించబోతున్నారు. అశోక్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలన్నది ఇంకా డిసైడ్ అవలేదు. కొత్త డైరెక్టర్ తో సినిమా త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహేష్ సోదరి మంజుల హీరోయిన్ గా రాణించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కు తగ్గింది. ఆమె కుమార్తె జాన్విని హీరోయిన్ చేయాలని అనుకుంటోంది. ఆమె హీరోయిన్ కావడానికి ఇంకా కొంతకాలం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి మంజుల డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమాలో ఆమెతో ఓ స్పెషల్ రోల్ చేయించారు. మొత్తంమీద ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి భవిష్యత్తులో ఓ హీరో.. ఓ హీరోయిన్ ను చూడొచ్చన్నమాట.