Begin typing your search above and press return to search.

IPL ఎంజాయ్ చేస్తున్న జూ. సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   10 April 2017 7:37 AM GMT
IPL ఎంజాయ్ చేస్తున్న జూ. సూపర్ స్టార్
X
సన్ రైజర్స్ హైద్రాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ సీజన్ ప్రారంభించి.. సూపర్బ్ ఆట తీరును కనబరిచింది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ లను గెలిచి.. పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో ఉంది. టాలీవుడ్ నుంచి చాలామంది తారలే సన్ రైజర్స్ ను సపోర్ట్ చేస్తున్నారు. నేరుగా స్టేడియంకు వచ్చి మరీ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

గుజరాత్ లయన్స్ తో సన్ రైజర్స్ తన సెకండ్ మ్యాచ్ ఆడి నెగ్గేసింది. ఈ మ్యాచ్ కు టాలీవుడ్ యంగ్ హీరోస్ అఖిల్.. సాయి ధరం తేజ్ లతో పాటు సురేష్ బాబు.. వెంకటేష్.. పూనమ్ కౌర్ లు కూడా హాజరయ్యారు. అయితే.. ఈ మ్యాచ్ కి వచ్చిన ఆడియన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం జూనియర్ సూపర్ స్టార్. అదేనండీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్. సన్ రైజర్స్ జెర్సీని ధరించి మరీ మ్యాచ్ ఆసాంతం ఎంజాయ్ చేశారు. ప్రతీ ఫోర్ కి.. సిక్స్ కి చప్పట్లు కొడుతూ ఆనందించాడు. మరింత మంది పిల్లలతో కలసి మ్యాచ్ ను వీక్షించాడు గౌతమ్.

ఈసారి ఐపీఎల్ ప్రారంభం నుంచే బాగా ఆసక్తిని కలిగిస్తోంది. తారలంతా ఆయా జట్లకు మద్దతు పలకుతుండడంతో.. ఐపీఎల్ కు గ్లామర్ కూడా తోడైంది. రానున్న మ్యాచ్ లలో మరింత మంది స్టార్లు.. సెలబ్రిటీలు ఐపీఎల్ వీక్షించేందుకు రానున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/