Begin typing your search above and press return to search.
మ్యాడీ తర్వాత మహేషే! వారసుడు ఉత్తమ గజ ఈతగాడు!!
By: Tupaki Desk | 17 Jun 2021 10:30 AM GMTమ్యాడీ అలియాస్ ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ ఈతలో మేటి అన్న సంగతి తెలిసిందే. ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున వేదాంత్ రజత పథకం సాధించాడు. పథకం సాధించిన అనంతరం మ్యాడీ ఆనందానికి అవధులే లేవు.
ఇప్పుడు అలాంటి ఆనందాన్ని సూపర్ స్టార్ మహేష్ కూడా షేర్ చేసుకునే సందర్భమిది. తెలంగాణలో టాప్ స్విమ్మర్స్ జాబితాలో మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ పేరు చేరింది. 1 నేనొక్కడినేలో బాలనటుడిగా కనిపించినా కానీ గౌతమ్ ఇటీవల చదువులపైనే దృష్టి పెట్టాడు. గౌతమ్ కేవలం చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారని తాజాగా తెలిసింది. తన ఏజ్ పోటీదారులతో తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ లో టాప్ 8 ఈతగాళ్ళలో తన స్థానాన్ని దక్కించుకున్నాడు.
తాజాగా నమ్రత తన వారసుడు సాధించిన ఘనతకు సంబంధించిన ఫోటోలను పంచుకోగా అభిమానుల్లో వైరల్ గా మారాయి. 2018 నుంచి ఈత నేర్చుకుంటున్న గౌతమ్ చక్కని స్థానం సంపాదించాడు. వేగంలో అతడు మేటి.. బటర్ ఫ్లై బ్యాక్ స్ట్రోక్.. బ్రెస్ట్‌స్ట్రోక్ అండ్ ఫ్రీస్టైల్ అనే నాలుగు ప్రదర్శనలను సులభంగా చేసేస్తాడు. ఫ్రీస్టయిల్ ని గౌతమ్ ఇష్టపడతాడు. 3 గంటలలోపు నాన్ స్టాప్ గా 5 కి.మీ ఈదగలడు అని తెలిపారు.
పదిహేనేళ్ల గౌతమ్ కి ఆయుష్ యాదవ్ శిక్షకుడు. అతడు ఈతలో మేటి శిక్షకుడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి రాష్ట్ర స్విమ్మింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. మహేష్ - నమ్రత జంటకే కాదు తెలుగు వారంతా గర్వించదగ్గ విజయమిది. గౌతమ్ మరింతగా ఈతలో ఎదగాలి. పథకాలు తేవాలని ఆకాంక్షిద్దాం.