Begin typing your search above and press return to search.
ఆరేళ్ల మహేష్ ని చూశారా?
By: Tupaki Desk | 9 Dec 2018 6:30 AM GMTమహేష్ నవ్వితే ఎలా ఉంటుంది? అరెరే మంచి ముత్యాలు జారి నేల పై పడతాయా? అన్నట్టే ఎంతో ముచ్చటగా ఉంటుంది కదూ? 40 వయసు లోనూ మహేష్ స్మైల్ కి, ఆరేడేళ్ల వయసు లో ఉన్నప్పుడు ప్రిన్స్ బుల్లోడి స్మైల్ కి తేడా ఎంతో ఉంటుందేమో అనుకున్నారేమో! అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టేనని ఈ ఫోటో చూశాక అంగీకరిస్తారు.
ఇదిగో 35 ఏళ్ల క్రితం రిలీజైంది `పోరాటం` సినిమా. ఇదే మహేష్ నటించిన తొలి సినిమా. సూపర్‌స్టార్ కృష్ణ తో కలిసి చిన్నారి మహేష్ ఎంతో ఒద్దికగా రాముడు మంచి బాలుడు తరహా లో కనిపిస్తున్న ఈ ఫోటో లు ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యాన్స్ లో జోరు గా వైరల్ అవుతున్నాయి. మహేష్ నటించిన తొలి చిత్రమిది! అంటూ సూపర్‌స్టార్ కృష్ణ వీరాభిమాని, సీనియర్ పీఆర్‌వో బీ ఏ రాజు ఈ ఫోటోల్ని వైరల్ చేశారు.
ఇది ఆదిమానవుడి ఆరాటం .. ఆ దైవంతోనే చెలగాటం.. విధి ఆడే ఈ చదరంగంలో జీవితమే ఓ పోరాటం!! అంటూ పడే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్‌ని కృష్ణ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. 09-12-1983 లో రిలీజైంది ఈ చిత్రం. నేటి జనరేషన్ కి తెలిసింది తక్కువే అయినా ఇలాంటి క్లాసిక్ సినిమాల్ని నాటి జనరేషన్ అభిమానులు ఇప్పటి కీ పూజిస్తూనే ఉంటారు. అయితే అప్పట్లో చిన్నారి మహేష్ ఎలా ఉండేవాడో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. నాన్న కూచీ .. బుజ్జికన్నలా ఉన్నాడు కదూ? ఇప్పటికి ఇంతింతై `మహర్షి` అంత అయ్యాడు. పాతిక సినిమాల కథానాయకుడిగా, అగ్రకథానాయకుడిగా టాలీవుడ్ ని ఏల్తున్నాడు.