Begin typing your search above and press return to search.

సమ్మర్ ను మిస్సయిన సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   16 April 2023 3:02 PM GMT
సమ్మర్ ను మిస్సయిన సూపర్ స్టార్
X
సూపర్ సీజన్ లో హాలిడే టైమ్ ఎక్కువ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ తర్వాత ఏవైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మాత్రం ఎక్కువగా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే అవకాశం దొరుకుతుంది. ఈ నేపధ్యంలో కొంత మంది స్టార్ హీరోలు సమ్మర్ టైమ్ లో సినిమా రిలీజ్ ప్లానింగ్స్ పెట్టుకుంటారు. ఆ టైమ్ కి కరెక్ట్ గా వినియోగించుకొని కలెక్షన్స్ కొల్లగొడతారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ లో ఉన్నారని చెప్పాలి.

సమ్మర్ టైమ్ ని మహేష్ బాబు కరెక్ట్ గా ఉపయోగించుకున్నారు. 2018లో భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మూవీ కూడా రికాద్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీ 2019 మే 9న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మహేష్ బాబు కెరియర్ లో నిలిచింది.

గత ఏడాది పరశురామ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సర్కారువారిపాట మూవీ మే 12న రిలీజ్ అయ్యి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే విధంగా మహేష్ బాబు కెరియర్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. తన తండ్రి తరహాలో స్పీడ్ గా కాకుండా ప్రతి ఏడాది ఒక మూవీతో వస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు.

శ్రీమంతుడు నుంచి సూపర్ స్టార్ కెరియర్ లో వరుసగా ఆరు సక్సెస్ లు ఉండటం విశేషం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జక్కన్న దర్శకత్వంలో చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని ముందే డిసైడ్ చేసేయొచ్చు.

అయితే ఈ వేసవి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ సినిమా లేకపోవడం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. మహేష్ సినిమా రేంజ్ లో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయగలిగే సినిమా ఒకటి కూడా ఏప్రిల్ లో ఇప్పటి వరకు రాలేదు. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు అయిన ఆశించిన స్థాయిలో సమ్మర్ హిట్ తగ్గిస్తూ ఆడియన్స్ ని రిలాక్స్ ఎంటర్టైన్ చేస్తాయా అనేది చూడాలి.