Begin typing your search above and press return to search.

ఆ కొంటె చూపు ఏంటి మహేష్

By:  Tupaki Desk   |   30 Dec 2017 6:50 AM GMT
ఆ కొంటె చూపు ఏంటి మహేష్
X
స్పైడర్ ఊహించిన దాని కన్నా ఎక్కువ దెబ్బ కొట్టినా వెంటనే కోలుకుని భరత్ అను నేను షూటింగ్ లో పడిపోయిన ప్రిన్స్ మహేష్ బాబు ఈ సారైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు. బ్రహ్మోత్సవం - స్పైడర్ మితిమీరిన అంచనాలు క్యారీ చేయటం వల్లే హైప్ అందుకోలేక డిజాస్టర్స్ అయ్యాయని ఫాన్స్ అంటున్నా బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం చూసుకుంటే మరే దివాలా తీయించే పరిస్థితి మాత్రం మహేష్ కల్పించడం లేదు. తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైంలో మాత్రం రాజీ పడే అలవాటు లేని మహేష్ పక్కా ప్లానింగ్ తో భార్య పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మహేష్ ని ఆదర్శంగా తీసుకోవాలి అని ఇతర హీరోలు కూడా అనుకోవడం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉన్న స్టార్ ఫ్యామిలీ కూడా మహేష్ దే అని ఒప్పుకోవాలి.

న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో కూడా తన ఫ్యామిలీతోనే గడుపుతున్న మహేష్ పైన ఫోటోలో ఎలా ఓరకంటితో ఎవరికో లైన్ వేస్తున్నట్టు ఎలా చూస్తున్నాడో గమనించారుగా. పక్కనే భార్య నమ్రతా శిరోద్కర్ - ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ కన్ను గప్పి మరీ చూపు విసురుతూ సెల్ఫీ కి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా. వయసు మీదపడుతుంటే గ్లామర్ వెనక్కు వెళ్ళే హీరోల్లో మహేష్ దే ఫస్ట్ ప్లేస్. అలాంటిది ఎప్పుడూ జెంటిల్ మెన్ లా సాఫ్ట్ గా కూల్ గా ఉండే మహేష్ ఇలా హస్కీ లుక్స్ తో ఫోటో వదిలితే వైరల్ కాకుండా . ఉంటుందా. ఇప్పుడు అదే జరిగింది. మీరూ ట్రై చేయండి. మహేష్ చూపు బాణంలో ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో.