Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఐరన్ మ్యాన్‌ తో 'సూపర్' సెల్ఫీ

By:  Tupaki Desk   |   26 Dec 2021 6:34 AM GMT
పిక్ టాక్ : ఐరన్ మ్యాన్‌ తో సూపర్ సెల్ఫీ
X
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ఈమద్య కాలంలో తన పిల్లలతో సరదాగా గడిపిన సందర్బాలను ఫొటోల రూపంలో అభిమానులతో షేర్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. రెగ్యులర్ గా పిల్లలతో హాలీడేస్ కు వెళ్లే మహేష్ బాబు తాజాగా క్రిస్మస్ వేడుకలను పిల్లలతో కలిసి మహేష్ బాబు జరుపుకున్నాడు. ఆ సందర్బంగా తీసిన ఈ ఫొటోను మహేష్ బాబు సోషల్ మీడియా లో షేర్‌ చేశాడు. మహేష్ బాబు మరియు సితారలు ఇద్దరు కూడా మాస్క్ లు ధరించి ఉన్నారు. ఈ ఫొటోలో వెనుక ఐరన్‌ మ్యాన్ ఉన్నాడు. వరల్డ్‌ ఫేమస్‌ ఐరన్‌ మ్యాన్‌ స్వయంగా మహేష్ బాబు మరియు క్యూటీ సితారతో సెల్ఫీ తీసుకున్నట్లుగా ఈ ఫొటో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఐరన్ మ్యాన్ కూడా సూపర్ స్టార్‌ మహేష్ బాబుకు వీరాభిమాని అయ్యి ఉంటాడు అందుకే సెల్ఫీ కోసం అలా చూస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్రిస్మస్ సందర్బంగా పార్టీ లు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఇదే సమయంలో మహేష్‌ బాబు ఫ్యామిలీతో ఇలా సరదాగా సమయాన్ని గడిపినట్లుగా ఫొటో చూస్తుంటే అర్థం అవుతోంది. పెద్ద ఎత్తున ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సితార మరియు మహేష్ బాబుల కలయికలో వచ్చే చిన్న ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ ఫొటో కూడా వైరల్ అయ్యింది.

సూపర్ స్టార్‌ మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. ఆ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను మహేష్ బాబు చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ తో సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి తో ఒక సినిమా ను మహేష్ బాబు చేస్తాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి ఆ విషయాన్ని ఫుల్‌ క్లారిటీతో చెప్పేశాడు. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ కూడా మహేష్ బాబుతో సినిమాను చేసేందుకు గాను కథను సిద్దం చేస్తున్నాడని ఆ మద్య వార్తలు వస్తున్నాయి. మొత్తానికి 2025 వరకు మహేష్ బాబు డేట్లు అయితే ఖాళీగా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.