Begin typing your search above and press return to search.

అంతఃకరణ శుద్ధిగా మరో గిఫ్ట్

By:  Tupaki Desk   |   6 May 2018 12:45 PM IST
అంతఃకరణ శుద్ధిగా మరో గిఫ్ట్
X
రెండేళ్ళ నుంచి హిట్ లేక తాను ఎంత మధనపడ్డాడో మహేష్ బాబు మీడియా సాక్షిగా భరత్ అనే నేను సక్సెస్ మీట్ లో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. బ్యాడ్ టైం లో ఉన్న రెండు సార్లు తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ గురించి ఎమోషనల్ కూడా అయ్యాడు. అందులో అర్థముంది. ఈ రోజు మహేష్ అభిమానుల్లో ఆనందం కనిపిస్తోంది అంటే దానికి కారణం కొరటాల శివనే. మహేష్ ని ఎలా చూపించాలో అర్థం కాక పొరపాట్లు చేసి డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుల కంటే తాను ఏ రకంగా స్పెషల్ అనేది సక్సెస్ సాక్షిగా రుజువు చేసాడు శివ. విడుదలకు ముందే యూనిట్ లో కీలకమైన సభ్యులకు చాలా ఖరీదైన ఐ ఫోన్ ఎక్స్ కానుకగా ఇచ్చిన మహేష్ ఇంత పెద్ద ఘన విజయాన్ని తన చేతిలో పెట్టిన కొరటాల శివను మాత్రం ఊరికే వదిలిపెడతాడా. అది జరిగింది కూడా.

శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ సందర్భంగా అప్పట్లో ఆడి ఎ 6 కారును కానుకగా ఇచ్చిన మహేష్ ఇప్పుడు అంతకు ఐదింతలు ఖరీదైన కారును గిఫ్ట్ గా ప్రెజెంట్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. మోడల్ ఏంటి ఎప్పుడు ఎక్కడ ఇచ్చారు అనే వివరాలు చాలా గోప్యంగా ఉంచారు. కాస్ట్ లీ ఫోర్ వీలర్ కాబట్టి ఊరికే అనవసర ప్రచారం అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పటికి బయట పెట్టకూడదు అని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం మూడో వారంలో ఉన్న భరత్ అనే నేను స్టడీగానే ఉంది. 180 గ్రాస్ రీచ్ అయినట్టుగా యూనిట్ అధికారికంగా పోస్టర్స్ కూడా విడుదల చేసింది.ఏదైనా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. ఇలా కానుకలు ఇచ్చే కాన్సెప్ట్ మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ప్లాన్ చేసిందట. ఇలాంటివి ఇస్తే ఇంకా బాధ్యతగా రాబోవు సినిమాలకు కష్టపడతారు అనే ఉద్దేశంతో నమ్రతా ఇది డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించబోయే 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వంశీ దీని లోకేషన్స్ వేటలో ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు.