Begin typing your search above and press return to search.

మనుష్షులందు నీ కథ మహర్షిలాగ సాగదా.. చిన్నిగుండెకు ప్రాణంపోసిన మహేష్

By:  Tupaki Desk   |   24 Dec 2020 10:00 AM IST
మనుష్షులందు నీ కథ మహర్షిలాగ సాగదా.. చిన్నిగుండెకు ప్రాణంపోసిన మహేష్
X
సినిమాల్లో హీరోలు అనిపించుకున్నవారంతా నిజజీవితంలో హీరోలు కాలేరు. కానీ.. కొందరు మాత్రం రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ నిజమైన హీరోలు అనిపించుకుంటారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. తన సంపాదనలో ఇప్పటికే చాలా వరకూ సొసైటీకి ఖర్చు చేశారు ప్రిన్స్. ఇప్పటికే ఎన్నో వేలాది చిట్టి గుండెలకు ఊపిరి పోసిన మహేష్ బాబు.. తాజాగా మరో చిన్నారికి ప్రాణం పోశారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమా అనే మహిళ బిడ్డ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆపరేషన్ అత్యవసరమైంది. ఈ విషయం మహేష్ వరకు చేరడంతో ఆ పాపకు శస్త్రచికిత్స చేయించాడు ప్రిన్స్. ఈ చికిత్సతో ఆ పాప ప్రాణాలు నిలిచాయి. మహేష్ బాబు అందించిన ఈ క్రిస్మస్ కానుకతో ఆ కుటుంబం చెప్పలేనంత సంతోషంలో మునిగిపోయింది.

ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసి, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వైద్యం అందించిన ఆంధ్ర ఆసుపత్రి ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు ఆ చిన్నారి తల్లిదండ్రులు బాగుండాలని ఆకాంక్షించారు నమ్రత. ఒకపక్క అభిమానుల కోసం సినిమాలు.. సమాజం కోసం ఇలా సహాయం చేస్తూ.. ‘మహర్షి’గా సాగిపోతున్నారు మహేష్ బాబు.