Begin typing your search above and press return to search.
`సరిలేరు నీకెవ్వరు` సెన్సార్ రిపోర్ట్
By: Tupaki Desk | 2 Jan 2020 1:46 PM GMTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పోటీలో నాలుగు సినిమాలు ఉన్నా సరిలేరు చిత్రానికి బజ్ తెచ్చేందుకు చిత్రబృందం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఇప్పటికే భారీగా థియేటర్లను లాక్ చేసి రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తోంది టీమ్.
పబ్లిసిటీలో విభిన్నమైన పంథాలో వెళుతూ ఆకట్టుకున్నారు. ప్రతి సోమవారం మాస్ ఎంబీ పాటలతో పాటు రకరకాల మార్గాల్లో బోలెడంత ప్రచారం చేశారు. సోషల్ మీడియాల్లో సరిలేరు పోస్టర్లు.. టీజర్లు జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. మరోవైపు స్టార్లు మీడియా ఇంటరాక్షన్స్ తో వేడెక్కిస్తున్నారు.
తాజాగా సెన్సార్ రిపోర్ట్ అందింది. ఈ చిత్రానికి సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ని ఇచ్చింది. అలాగే జనవరి 11న సినిమాని రిలీజ్ చేయనున్నారు. సూపర్ స్టార్ మహేష్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ సీన్స్ సహా ఇందులో ఆర్మీ క్యాంప్ సీన్స్.. కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద యాక్షన్ ఎపిసోడ్స్ హైలైల్ గా నిలవనున్నాయట. అలాగే ట్రైన్ ఎపిసోడ్స్ లో రష్మికతో రొమాన్స్ కామెడీ సహా ప్రతిదీ మైమరిపిస్తాయని తెలుస్తోంది. ఈ సంక్రాంతి బరిలో పక్కా ఫ్యామిలీ బొమ్మ ఇదన్న టాక్ లీకైంది.