Begin typing your search above and press return to search.

మహేష్ పోలీస్ కాదట!

By:  Tupaki Desk   |   14 May 2019 10:04 AM IST
మహేష్ పోలీస్ కాదట!
X
మహర్షి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు త్వరలో అనిల్ రావిపూడి షూటింగ్ కోసం రెడీ అవ్వనున్నాడు. ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ చేయడం పూర్తి చేసేసిన దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అనిల్ సుంకర నిర్మాతగా రూపొందనున్న ఈ మూవీలో మహేష్ దూకుడు తరహాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నాడనే టాక్ కొద్దిరోజుల క్రితం వచ్చింది.

దాని తరహాలోనే ఫుల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు న్యూస్ ప్రచారమయ్యాయి. కానీ అది నిజం కాదట. మహేష్ ఇందులో చేస్తోంది పోలీస్ ఆఫీసర్ పాత్ర కాదని విశ్వసనీయ సమాచారం. మరి ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. దానికి టైం పడుతుంది. అసలు ఏ జానర్ లో అనిల్ రావిపూడి కథను రాసుకున్నాడో ఇంకా అంతుచిక్కడం లేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఉంటుందన్న క్లారిటీ మాత్రం వచ్చేసింది

భరత్ అనే నేను మహర్షిల వరస విజయాల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీగా దీని మీద అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాక మహేష్ రేంజ్ స్టార్ హీరోతో చేస్తున్న మూవీగా అనిల్ రావిపూడి మీద చాలా ఒత్తిడి ఉంది. దానికి తోడు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోవడంతో స్లోగా షూటింగ్ చేయడానికి లేదు.

వచ్చే నెల మొదలుపెట్టినా చేతిలో కేవలం 6 నెలల టైం మాత్రమే ఉంటుంది. డిసెంబర్ కంతా ఫస్ట్ కాపీతో రెడీగా ఉండాలి. ఖచ్చితమైన ప్లానింగ్ ఉంటే తప్ప ఇది సాధ్యపడదు. పైగా మహేష్ ఏడాది గ్యాప్ లోనే రెండు సినిమాలు విడుదల చేయడం చాలా అరుదు ఈ నేపథ్యంలో మహేష్ ని అనిల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది