Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవరిపైనో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Jun 2020 9:45 AM IST
మ‌హేష్ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవరిపైనో తెలుసా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రిపైనో తెలుసా? ఇంత‌కీ ఏ వ‌య‌సులో ఆయ‌న‌కు ఫ‌స్ట్ క్ర‌ష్ అయ్యిందో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు. త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ మ్యాట‌ర్ ఏమిటో మ‌హేష్ మాట‌ల్లోనే వింటే.. త‌న‌కు 26 వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఫ‌స్ట్ క్ర‌ష్ అయ్యింద‌ని.. ఆమె ఎవ‌రో కాదు న‌మ్ర‌త శిరోద్క‌ర్ అని చెప్పాడు మ‌హేష్‌. ఆ త‌ర్వాత త‌న‌తోనే ల‌వ్ లో ప‌డి పెళ్లాడేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జంటకు వివాహం జరిగి సుమారు 15 సంవత్సరాలు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. గౌత‌మ్(13).. సితార (7) ఇప్ప‌టికే స్కూల్ కిడ్స్ గా ఎదిగేశారు.

తాజా ఇన్ స్టా చిట్ చాట్ లో మహేష్ తన అభిమానులతో సంభాషిస్తున్నప్పుడు.. న‌మ్ర‌త‌పై క్ర‌ష్ గురించి త‌న‌ని న‌మ్ర‌త ఎంత‌గా ప్రేమించిందో కూడా చెప్పారు. ఓ అభిమాని మాత్రం మీకు ఎవరిపై అయినా క్రష్ అయ్యిందా? అని అడిగారు. తనకు 26 ఏళ్ళ వయసులో ఒకరిపై క్రష్ ఉందని వెల్లడించాడు. అయితే ఆ త‌ర్వాత త‌న‌తో ల‌వ్ లో ఉన్నాన‌ని తెలిపారు. భార్య నమ్రతా శిరోద్కర్ ను ట్యాగ్ చేసి.. తనపైనే నా క్రష్ అని తెలిపాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అన్న ప్ర‌శ్న‌కు.. తన భార్యను తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. అయితే సామాజిక మాధ్య‌మాల్లో సెల‌బ్రిటీల డిప్ల‌మాటిక్ ఆన్స‌ర్స్ ఇలానే ఉంటాయ‌న్న‌ది అభిమానుల అభిప్రాయం. మ‌హేష్ కి టీనేజీలో క్ర‌ష్ అవ్వ‌లేదా? 26 వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ క్ర‌ష్ అన్న‌దే లేదా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మహేష్ 26 వ‌య‌సులో నమ్రతా శిరోద్కర్ తో కలిసి వంశీ (2000) చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ ముగిసాక డేటింగ్ చేశారు. ఐదేళ్ల డేటింగ్ త‌ర్వాత మహేష్ - నమ్రత 2005 లో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత సంగ‌తులు తెలిసిందే. ఇటీవ‌ల మ‌హ‌మ్మారీ నిర్భంధ స‌మ‌యంలో మహేష్ భార్యా పిల్ల‌ల‌తోనే స‌మ‌యాన్ని గడిపారు. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని తాజాగా స‌ర్కార్ వారి పాట చిత్రాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైటిల్ ని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ఇందులో మ‌హేష్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.