Begin typing your search above and press return to search.

మహేష్‌ మోకాలి నొప్పి గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   1 Oct 2017 11:32 AM GMT
మహేష్‌ మోకాలి నొప్పి గురించి తెలుసా?
X
చాలామంది స్టార్లు వారు సీనియర్లుగా ఎదిగిపోయేకొద్ది ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతూనే ఉంటారు. అదిగో పవన్ కళ్యాణ్‌ నే తీసుకుంటే ఆయన బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇతర స్టార్లకు కూడా ఒక్కొక్కరికీ ఒక్కో ప్రాబ్లమ్ ఉన్నా.. అందరూ బయటకు చెప్పకపోవచ్చు. అయితే మహేష్‌ బాబుకు కూడా ఒక మోకాలి నొప్పి ఇష్యూ ఉంది తెలుసా?

స్పైడర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఒక చేజ్ సీన్ తీస్తున్నప్పుడు మహేష్‌ మోకాలికి పెద్ద గాయమే అయ్యింది. ఈ విషయం యునిట్ అందరికీ చెప్పకుండా.. కామ్ గా డాక్టర్ల దగ్గరకు వెళ్ళి చెక్ చేయిస్తే.. సర్జరీ చేయాలి.. ఏకంగా ఐదు నెలలు రెస్ట్ తీసుకోవాలి అన్నారట. దానితో స్టన్ అయిన మహేష్‌.. అసలు షూటింగ్ అన్నేసి రోజులు ఆపితే.. నిర్మాతకు కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి.. పెయిన్ కిలర్లను వేసుకుని షూటింగ్ కానిచ్చేశాడట. సినిమాలోని దాదాపు ప్రతీ యాక్షన్ సన్నివేశంలోనూ మనోడు ఈ నొప్పితేనే కంటిన్యూ చేశాడట. కాని విశేషం ఏంటంటే.. సినిమా షూటింగ్ పూర్తయ్యేనాటికి నొప్పికూడా ఆటోమ్యాటిక్ గా తగ్గిపోయింది అంటున్నాడు మహేష్‌.

కాకపోతే చాలాసార్లు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు మొదట్లో తగ్గినట్టే ఉంటాయి కాని తరువాత తిరగబడతాయి. కాబట్టి మహేష్‌ త్వరగా చెకప్ చేయించుకుని ఏదన్నా మెడిసన్ లేకపోతే సర్జరీ చేయించుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.