Begin typing your search above and press return to search.

మహేష్ మాయావిని బ‌తిమాలుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   1 Nov 2020 1:00 PM GMT
మహేష్ మాయావిని బ‌తిమాలుకుంటున్నాడా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిదీ ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. రాబోయే రోజుల్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రాజెక్ట్ ను ప‌క్కాగా ప్లాన్ చేయాల‌నుకుంటున్న టైమ్ లో మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ అకస్మాత్తుగా ప్రతిదీ మార్చేసింది.

జక్క‌న్న పూర్తి చేయాల్సిన ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రీక‌ర‌ణ‌ అనూహ్యంగా ఆలస్యం అయ్యింది. ఇప్ప‌టి ప‌రిస్థితులు చూస్తుంటే రాజమౌళి మహేష్ చిత్రాన్ని ప్రారంభించడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఈ చిత్రం ప్రారంభమైన తర్వాత ఎప్ప‌టికి పూర్తి చేస్తారో కూడా అంచ‌నా వేయ‌లేం.

అయితే మహేష్ కెరీర్ ప‌రంగా ఎలాంటి గ్యాప్ ను కోరుకోర‌న్న సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుతానికి ఓకే చెప్పిన‌ రెండు చిత్రాలపైనే ఫోక‌స్ చేస్తున్నార‌ట‌. ప‌ర‌శురామ్ తో సర్కారు వారి పాట .. త్రివిక్రమ్ తో మరో చిత్రం ఒకేసారి షూట్ చేయాలనుకుంటున్నారని తెలిసింది.

ఎన్టీఆర్ కూడా బిజీగా ఉన్నందున..., తన సినిమాని ప్రారంభించి కొన్ని షెడ్యూల్స్ షూట్ చేయాలని మహేష్ త్రివిక్రమ్ కు ప్రతిపాదించాడని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానం మాత్ర‌మే అయినా.. అంద‌రి దృష్టినీ ఆకర్షించింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.