Begin typing your search above and press return to search.
తారక్-మహేష్-చెర్రీ మల్టీస్టారర్
By: Tupaki Desk | 28 July 2018 4:12 AM GMTపదేళ్ల కెరీర్‌లో ఐదే ఐదు సినిమాలు తీశాడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం తన కెరీర్ లో ఆరో సినిమాని తీస్తున్నాడు. అందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నాడు కాబట్టి - క్వాంటిటీ కంటే క్వాలిటీనే నమ్ముకున్నాడని అంతా భావిస్తున్నారు. అదంతా అటుంచితే నిన్నటిరోజున వంశీ బర్త్ డే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ కాస్త వెరైటీగా 40ఏళ్ల బాలకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సామాజిక మాధ్యమాల్లో విష్ చేశారు.
అదంతా సరే... అంత పెద్ద స్టార్లతో సినిమాలు తీసిన వంశీ బర్త్‌డే పార్టీ ఇచ్చాడా? అంటే ఇవ్వకుండా ఉంటాడా? తన స్నేహితులు రామ్ చరణ్ - ఎన్టీఆర్ - మహేష్ లను పిలిచి మరీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చెట్టాపట్టాల్ అంటూ ఫుల్ గా చిలౌట్ చేశారు. ఇదిగో ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా ఈ ముగ్గురూ పలు సందర్భాల్లో పార్టీల్లో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురూ ఓచోట కనిపిస్తే అభిమానులకు మాత్రం ఫుల్ దిమాక్ ఖరాబ్... ఎందుకో!! అయితే ఆ ముగ్గురిని కలిపి ఓ మల్టీస్టారర్ తీయొచ్చు కదా! అని వంశీని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ తారక్-మహేష్-చెర్రీ మల్టీస్టారర్ తీస్తారా? లేదా?