Begin typing your search above and press return to search.
టాప్ స్టార్స్ – త్రీ చీర్స్
By: Tupaki Desk | 7 April 2018 1:24 PM GMTఒన్స్ అపాన్ ఏ టైం అంటూ అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం స్టార్ హీరోల ఫాన్స్ ఒకరి మీద ఒకరు దుమ్మెతిపోసుకునే వారు తిట్టుకునేవారు అని ఫ్లాష్ బ్యాక్ కథలుగా చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. తమ అభిమాన కథానాయకుల సఖ్యత చూసి అభిమానులు కూడా తమ తీరును మార్చుకుంటున్న తీరు టాలీవుడ్ లో కొత్త శకానికి నాంది పలుకుతున్నట్టు అనిపిస్తోంది. పక్క హీరో సినిమాని పొగడకూడదు - వాళ్ళ వేడుకలకు వెళ్ళకూడదు అనే ఈగోలను పక్కన పెట్టి రియల్ లైఫ్ లో తాము ఎంత స్నేహంతో ఉంటామో బయట ప్రపంచానికి కూడా అదే చాటి చెప్పే పనిలో పడ్డారు మన నవతరం హీరోలు.రాజమౌళి మల్టీ స్టారర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఊహకు కూడా అందని కొణిదెల-నందమూరి కాంబోని సెట్ చేయటం ద్వారా దీనికి నాంది పడింది అని చెప్పొచ్చు. తామిద్దరూ అసలు కథే వినలేదని జస్ట్ రాజమౌళి పిలవగానే ఓకే చెప్పామని అవతలి హీరో ఎవరో తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పడం అందరిని ఆకర్షించింది.
ఇక భరత్ అనే నేను వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ని పిలవాలి అనుకోగానే తను వస్తానని చెప్పడం మహేష్ కూడా సంతోషంగా అంగీకారం తెలపడం చూస్తుంటే ఒక ఆరోగ్యకరమైన పోటీకి శ్రీకారంగా భావించాలి. రంగస్థలం విడుదల అయ్యాక జూనియర్ ఎన్టీఆర్-మహేష్ బాబు చరణ్ పెర్ఫార్మన్స్ గురించి సినిమా గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేయటం ఫాన్స్ లో జోష్ నింపింది. దాని వల్లే ఓసారి సినిమా చూద్దాం అనుకున్న ఆయా హీరోల అభిమానులు లేకపోలేదు. భరత్ అనే నేనుకి తమ హీరో గెస్ట్ గా వచ్చాడు కాబట్టి తారక్ ఫాన్స్ ఖచ్చితంగా సినిమాపై ఓ లుక్ అయితే వేస్తారు. తమ హీరోతో కలిసి నటిస్తున్నాడు అనే సాఫ్ట్ కార్నర్ తో చరణ్ ఫాన్స్ తారక్ వైపు తమ దృక్పధాన్ని ఇంకా పాజిటివ్ గా మార్చుకుంటారు. ఇక భరత్ అనే నేనుకి సహజంగానే ఇద్దరు అభిమానుల మద్దతు ఉండనే ఉంటుంది.
ఇది ఇలాగే కొనసాగాలి. ఇలా హీరోలు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తే సోషల్ మీడియాలో ట్రాలింగ్ పేరుతో ఒకరికొకరు చులకన చేసుకునే తప్పుడు పద్దతులకు స్వస్తి చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఆ దిశగానే వెళుతోంది. పైగా మల్టీ స్టారర్ల జోరు టాలీవుడ్ లో పెరుగుతోంది. నాగార్జున-నాని-వెంకటేష్-నాగ చైతన్య-వరుణ్ తేజ్ వీళ్ళంతా సోలో హీరోలుగా కాకుండా కథలో తమతో సమానంగా భాగమయ్యే మరో హీరో అంటే అభ్యంతరం చెప్పడం లేదు. స్టార్ వార్స్ కి చెక్ పెట్టే ఇలాంటి ఆరోగ్యకర పోకడలను ఆహ్వానించాల్సిందే.