Begin typing your search above and press return to search.
`పుష్ప` మహేష్ కి అందుకే నచ్చలేదా?
By: Tupaki Desk | 29 Jan 2022 4:30 AM GMTకొన్ని సినిమాలు కొంత మందికి మాత్రమే రాసిపెట్టి వుంటాయి. కొన్ని ఎంత చేయాలని ప్రయత్నించినా కుదరవు. కొంత మంది కావాలని వద్దని పక్కన పెట్టినవి మరొకరి కెరీర్ ని మలుపు తిప్పినవి టాలీవుడ్ లో చాలానే వున్నాయి. పవన్ కల్యాణ్ తో చేయాలనుకున్న `ఇడియట్` రవితేజ చేయడం అది అతని కెరీర్‌ని మలుపు తిప్పడం తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్ తో చేయాలనుకున్న `పోకిరి` మహేష్ ని వరించడం.. అది అతనికి ఇండస్ట్రీ హిట్ ని అందించడమే కాకుండా హీరోగా మహేష్ కు స్టార్‌డమ్ ని తెచ్చి పెట్టడం తెలిసిందే.
ఇక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ గా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. ఈ మూవీ ముందు శర్వానంద్, అల్లు అర్జున్ ల వరకు వెళ్లి చివరికి విజయ్ దేవరకొండని వరించడం, ఆ పాత్రకు తాను తప్ప మరొకరు న్యాయం చేయాలేరన్నంతగా విజయ్ దేవరకొండ ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేయడంతో `అర్జున్‌రెడ్డి` అతని కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. రౌడీ స్టార్ ని చేసింది. అలాంటి మెరాకిల్ పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్న `పుష్ప` విషయంలోనూ జరిగింది.
గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీలోని `పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదేలే...` అంటూ బన్నీ చెప్పే డైలాగ్ ఇప్పడు దేశమంతా మారుబ్రోగిపోతోంది. చిన్నా పెద్దా అంతా ఇదే డైలాగ్ ని రీక్రేయేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి స్టార్ క్రికెటర్ ల వరకు `పుష్ప` మేనియాలో మునిగి తేలుతున్నారు. మేకర్స్ కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ ని సొంతం చేసుకుని భారీ వసూళ్లని రాబడుతున్న ఈమూవీ గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
విషయం ఏంటంటే ముందు `పుష్ప` కథని సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారట. అంతా బాగానే వుంది కానీ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు మారీ మాసీవ్ గా వుందని, ఒక విధంగా చెప్పాలంటే నెగటివ్ గా వుందని, దాన్ని మార్చమని మహేష్.. సుకుమార్‌కు చెప్పారట. అయితే అదే కథకు కీలకమని దాన్ని మారిస్తే కథలో ఫీల్ వుండదని సుకుమార్ వాదించారట. అంతే కాకుండా `పుష్ప` మేకోవర్ పై కూడా మహేష్ అసంతృప్తిని వ్యక్తం చేశాడని, అది కూడా మార్చడానికి వీళ్లేదని సుక్కు చెప్పడంతో ఈ కథలో నటించడం కుదరదని మహేష్ తప్పుకున్నాడట.
దీంతో కథని, కథలోని క్యారెక్టర్ ని, దాని మేనరిజాన్ని మార్చడం ఇష్టలేక అదే కథని సుకుమార్ ఆ తరువాత బన్నీకి చెప్పడం.. వెంటనే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయని, వెంటనే మైత్రీ మూవీమేకర్స్ రంగంలోకి దిగి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో `పుష్ప` కార్యరూపం దాల్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. `పుష్ప` క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు నచ్చకపోవడం వల్లే మహేష్ ఈ సినిమాని వద్దనుకున్నాడని, ఆ కారణంగానే సుకుమార్ - మహేష్ మధ్య దూరం ఏర్పడిందని ఇన్ సైడ్ టాక్.
అయితే సుకుమార్ డిజైన్ చేసిన క్యారెక్టర్ వల్లే `పుష్ప` పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుండటం విశేషం. అదే లేకపోతే సినిమానే లేదు. అందుకే సుకుమార్ `పుష్ప` క్యారెక్టర్ డిజైనింగ్ విషయంలో తగ్గేదేలే అని ప్రవర్తించాడు కాబట్టే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ హిట్ ని సొంతం చేసుకోగలిగాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.