Begin typing your search above and press return to search.

'కార్మికులారా! ఇవే నా ధన్యవాదాలు' అంటున్న సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   16 April 2020 5:20 PM IST
కార్మికులారా! ఇవే నా ధన్యవాదాలు అంటున్న సూపర్ స్టార్
X
కరోన కారణంగా ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటేనే వణుకుతున్నారు. గడప దాటాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది తమ ప్రాణాలకు తెగించి మన ప్రాణాల కోసం కష్టపడుతున్నారు. వీళ్లలో ముందు వరుసలో ఉన్న వాళ్లు డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. అందుకే వీరి కృషిని ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మీరు బయట పనిచేస్తుండటం వల్లే మేం ఇంట్లో ధైర్యంగా ఉండగలుగుతున్నాం.. అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ విషయం పై తాజాగా సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించాడు. ఆయన వారి వీధుల్లో పలు రకాల అవసరమైన సేవలను అందిస్తున్నటువంటి ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. దానితో పాటు కొంత సమాచారాన్ని కూడా పోస్టుచేశారు. ఇప్పటికే పోలీసులను, డాక్టర్లను కీర్తిస్తూ ట్వీట్లు చేసిన మహేష్ తాజాగా పారిశుధ్య కార్మికులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. 'మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న వారికోసం ఈ ట్వీట్. మనం అంతా ఇంట్లో సురక్షితంగా ఉంటే వారు మాత్రం బయట మన కోసం పనిచేస్తున్నారు. ప్రమాదాలు మన దరిచేరకుండా చూస్తున్నారు. ప్రాణాంతక వైరస్‌ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి మన కోసం యుద్ధం చేస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు మహేష్.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మహేష్ తరువాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం గోత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.