Begin typing your search above and press return to search.

'తుఫాన్' కు మహేష్ బాబు ప్రశంసలు..!

By:  Tupaki Desk   |   12 March 2021 2:27 PM IST
తుఫాన్ కు మహేష్ బాబు ప్రశంసలు..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు నచ్చిన సినిమాల గురించి టీజర్ - ట్రైలర్స్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు లేకుండా.. మంచి కంటెంట్, నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది అనిపిస్తే వెంటనే పోస్ట్ పెట్టి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ మూవీ అప్డేట్స్ విషయంలో ముందుండే మహేష్ బాబు.. తాజాగా బాలీవుడ్ హీరో ఫ‌ర్హాన్ అక్త‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 'తుఫాన్' చిత్ర టీజ‌ర్‌ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ట్విట్టర్ ఖాతాలో 'తూఫాన్' టీజర్ గురించి పోస్ట్ పెట్టిన మహేష్ బాబు.. టీజర్ టెర్రిఫిక్ గా ఉందని, ఫర్హాన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ బిలీవబుల్ అని బాక్సర్ గా తన శరీర ఆకృతిని మార్చుకున్న విధానాన్ని మెచ్చుకున్నారు. అలానే ఈ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మహేష్ ట్వీట్‌ లో పేర్కొన్నారు. కాగా, ''తుఫాన్'' చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించాడు. మృణాల్‌ ఠాకూర్‌‌ - పరేష్‌ రావల్‌ కీలక పాత్రలు పోషించారు. 'భాగ్ మిల్ఖా భాగ్‌' తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌ - రాకేష్‌ ఓం ప్రకాశ్‌ కాంబినేషన్‌ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ‘తుఫాన్’ చిత్రాన్ని మే 21న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయనున్నారు.