Begin typing your search above and press return to search.

అతనుంటే 99% సినిమాలు హిట్

By:  Tupaki Desk   |   25 April 2018 12:25 PM IST
అతనుంటే 99% సినిమాలు హిట్
X
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నారు. చాలా మంది హీరోలు మొదట వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు. ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత మార్పు వచ్చింది. కానీ బ్రహ్మాజీలో మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదు. అప్పటి నుంచి అదే గ్లామర్ అదే ఫిట్ నెస్. చాలా మంది హీరోలు ఆయనతో క్లోజ్ గా ఉంటారు. కొందరైతే ఆటపట్టిస్తుంటారు.

ఇక రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి పక్కన పర్సనల్ సెక్రటరీ అనే పాత్రలో కనిపించి అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. మహేష్ అయితే బ్రహ్మాజీని చాలా పొగిడేశారు. బ్రహ్మాజీ ఉంటే నా సినిమాలు 99% హిట్ అని చెప్పశాడు. అంతే కాకుండా కొరటాల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు ఈ సీనియర్ నటుడు. బ్రహ్మాజీ తన అభిమాన నటులలో ఒకరని దర్శకుడు కోరటాల శివ మాట్లాడుతూ..అతను ఎప్పుడైనా భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాల్లో అద్భుతంగా నటించగలడు.

అరుదైన నటుడు. ఎమోషనల్ సన్నివేశంలో నటించడానికి ముందు అతను ఆ సీన్ తాలూకు ఎమోషన్ ని మొదట అర్థం చేసుకొని ఫీల్ అవుతాడు. అతను ఒక సహజ నటుడని తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రం యొక్క ఫస్ట్ హాఫ్ బ్రహ్మాజీకి చెందినది అంటూ మహేష్ బాబు తో కలిసి మంచి వినోదాన్ని అందించినట్లు కొరటాల అభిప్రాయపడ్డారు.