Begin typing your search above and press return to search.
భరత్ పంచ్ లు ఎవరిపైనో?
By: Tupaki Desk | 7 March 2018 4:21 AM GMTరాష్ట్రంలో.. దేశంలో రాజకీయం వేడెక్కుతోంది. కరెక్టుగా ఇదే టైంలో పొలిటికల్ జోనర్ లో ఓ స్టార్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని ముందే రివీల్ చేశారు. కానీ ఆ పాత్రలో ఎలా కనిపించబోతున్నాడనేది తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో చూపించారు.
భరత్ అనే నేను సినిమాలో రాజకీయ కథాంశంతో తీసిన చిత్రం మాత్రమేనని.. ఇందులో పాలిటిక్స్ గురించి పెద్దగా ఏమీ ఉండదంటూ సినిమా యూనిట్ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు టీజర్ చూస్తే అంతా పాలిటిక్సే కనిపిస్తోంది. పాలిటికల్ జోనర్ లో వచ్చే సినిమాలు కరెంట్ ట్రెండ్ కు కనెక్టయ్యేలా ఉంటేనే బాగా ఎక్కుతాయి. భరత్ అనే నేను టీజర్ చూస్తే అదేదారిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఇచ్చిన మాట ఎంత కష్టపడి అయినా నిలబెట్టుకోవాలన్న మాట చుట్టూ సాగుతుంది.
మాట ఇచ్చి తప్పడం అన్న పంచ్ స్టేట్ పార్టీల మీద వేశారా.. లేక సెంట్రల్ పార్టీల మీద వేసిన పంచా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులో పొలిటికల్ పంచులు భారీగానే ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. వరస ఫ్లాపులతో నీరసపడిపోయిన అతడి ఫ్యాన్సుకు మంచి ఉత్సాహం తెచ్చేలా భరత్ అనే నేను టీజర్ ఉంది. ఈ సినిమాలో మహేష్ పక్కన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ పొలిటికల్ పంచ్ లు బయటకు వస్తున్న కొద్దీ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందడనంలో ఏ మాత్రం డవుట్ లేదు.