Begin typing your search above and press return to search.

మహేశ్ బాబు తో ఫోటో షూట్ రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   25 Dec 2019 4:11 PM IST
మహేశ్ బాబు తో ఫోటో షూట్ రచ్చ రచ్చ
X
సినిమా ప్రమోషన్ లో భాగంగా వినూత్నంగా ప్లాన్ చేయటం మామూలే. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు తో ఆయన అభిమానులు ఫోటో షూట్ కు అవకాశం కల్పిస్తూ ఏకే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సోషల్ మీడియా లో ఒక పోస్టు చేసింది.

మహేశ్ బాబుతో ఫోటో షూట్ రావాలన్న ఆన్ లైన్ ప్రకటన కు స్పందించిన ఆయన ఫ్యాన్స్ వేలాదిగా గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు.ఆన్ లైన్ లో ప్రకటనకు ఇంత స్పందన ఉండదని ఫీలయ్యారో లేక ఇంకేదైనా కారణమో కానీ.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవటమే కాదు.. పోలీసుల నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదు.

మహేశ్ బాబుతో ఫోటో షూట్ కావటం తో వేలాదిగా ఆయన అభిమానులు గచ్చిబౌలిలోని అల్యూమినియం ప్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఫోటో షూట్ కోసం విరగబడటంతో ఫ్యాన్స్ ను అదుపు చేయటం సాధ్యం కాలేదు. ముందస్తు జాగ్రత్త కోసం ఏర్పాటు చేసిన బార్ గేట్స్ విరిగి పోయాయి. దీంతో.. అక్కడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉండటం తో చోటు చేసుకున్న తొక్కిస లాటలో ఇద్దరు అభిమానుల కాళ్లు విరిగాయి. దీంతో.. వారిని ప్రైవేటు ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అభిమానుల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.