Begin typing your search above and press return to search.
సమంత వలనే ప్యారిస్ వెళ్తున్నాడా??
By: Tupaki Desk | 15 Oct 2015 6:53 PM ISTఅసలు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ మధ్య ఒక సినిమా దాదాపు పూర్తయ్యేనాటికి కాని విదేశాలకు టూర్ వెళ్లలేదు. ఏదో మలేషియా లో షూటింగ్ చేస్తున్నప్పుడు శ్రీమంతుడు టీమ్ నుండి ఒక రెండు రోజులు బ్రేక్ తీసుకొని సింగపూర్ వెళ్లాడంతే. కాని ఇప్పుడు మాత్రం బ్రహ్మోత్సవం పట్టుమని రెండు షెడ్యూల్ళు కూడా పూర్తవ్వకుండానే పారిస్ చెక్కేస్తున్నాడు. ఎందుకంటారూ?
తన కొడుకు గౌతమ్ కు ఐఫిల్ టవర్ చూపించడానికి అంటూ మహేష్ బాబు సెలవిచ్చాడు కాని.. అసలు రీజన్ మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. మనం గతంలో చెప్పుకున్నట్లే.. అసలు మహేష్ - నితిన్ లు తమ సినిమాలను సరిగ్గా షూటింగ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకు అక్టబోర్ లో డేట్లు ఇచ్చిన సమంత సడన్ గా తన తమిళ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి చెన్నయ్ చెక్కేసింది. అక్టోబర్ 21 వరకు 10 ఎన్రాదుకుళ్ళ సినిమాను ప్రమోట్ చేయాలి.. ఆ తరువాత ధనుష్ సినిమా గురించి డప్పేయాలి. అందుకే డేట్లన్నీ క్యాన్సిల్ చేసేసి.. అందరికీ నవంబర్ 7 నుండి టైమ్ ఇచి్చందిట. సో.. అప్పటివరకు బ్రహ్మోత్సవం బండి లాగించడం కష్టమే మరి. అందుకే ఇప్పుడు మహేష్ ఇలా దొరికిన ఖాళీ టైమ్ ను చక్కగా ఫ్యామిలీ టూర్ కు వినియోగించుకుంటున్నాడు.