Begin typing your search above and press return to search.

కామెంట్‌: మహేష్‌ అలా పంచేశాడు

By:  Tupaki Desk   |   11 Sep 2015 2:11 AM GMT
కామెంట్‌: మహేష్‌ అలా పంచేశాడు
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.. టాలీవుడ్ రాజకుమారుడు. మరి ప్రిన్స్ అన్నాక అంతో ఇంతో అందరికీ పంచిపెట్టాలి కదా. ఈయనేమో కాస్త కమర్షియల్. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంత మంచిగా ఉండకూడదని అనుకున్నానని.. స్వయంగా మహేషే చెప్పాడు. మరి రాజకుమారిడిగా పంచిపెట్టాల్సిన సంగతేంటి ? అందుకే ఒక్కో సినిమాని ఒక్కోళ్లకు అంకితమిచ్చేస్తున్నాడు. అవును, మహేష్‌ అభిమానులు ఇప్పుడు సోషల్‌ సైట్లలో అదే చెబుతున్నారు మరి. పదండి ఓ లుక్కేద్దాం.

రాజకుమారుడుతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాని ప్రేమకి ఇచ్చేశాడు. టక్కరిదొంగని... దొంగలకి ఇచ్చాడు. దొంగల టైటిల్స్ కి, స్టోరీలకి.. కృష్ణ టైం నుంచి మంచి లింక్ ఉందిలెండి వీళ్ల ఫ్యామిలీకి. నిజంలో న్యాయం కోసం పోరాడేస్తాడు మహేష్ బాబు. పోలీసుల కోసం పోకిరీ చేశాడు. దేశం కోసం సైనికుడిగా పోరాడాడు. అన్నీ పాజిటివ్ అయితే ఎలా అనుకున్నాడేమో.. అందుకో మాఫియాకి సపోర్ట్ గా బిజినెస్ మ్యాన్ అన్నాడు.

ఫ్యామిలీ లింకులు కూడా ఉన్నాయండీ. అమ్మకేమో నాని, అక్కకి అర్జున్, నాన్నకి దూకుడు అంకితం ఇచ్చేసినట్లుగా ఉంటాయి సినిమాలు. మొత్తం ఫ్యామిలీ కోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని చేశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... శ్రీమంతుడిని సమాజం కోసం చేశాడు. మధ్యలో తనకోసం తాను వన్ నేనొక్కడినే ట్రై చేశాడు. ఇది వర్కవుట్ కాలేదు లెండి. ఇదీ మహేష్ మూవీలు.. కేరక్టర్ ల కథ. అభిమానులు ఈ విధంగా మనోడి సినిమాల గురించి క్రియేటివ్‌ గా చెప్పుకుంటున్నారు. బాగుందయ్యా యవ్వారం.