Begin typing your search above and press return to search.
ఎక్కువ మంచితనం వద్దనుకున్నాడట
By: Tupaki Desk | 24 Aug 2015 1:16 PM ISTమహేష్ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా.. చాలా మంచోడు అనే సమాధానం వస్తుంది. మొహమాటానికి కూడా సినిమాలు ఒప్పుకుని ఎదురుదెబ్బలు తిన్న అనుభవం ఉంది మహేష్ కి. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన శ్రీమంతుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అసలు ఇలాంటి సినిమా తీసే ధైర్యం ఏ స్టార్ కూడా చేయలేడు. అయినా సరే ధైర్యం చేసి, మూవీ తీయడమే కాకుండా.. అనేకమందికి గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఇన్ స్పిరేషన్ కలిగించాడు. స్వయంగా తానే రెండు గ్రామాలను దత్తత తీసుకుంటున్నాడు కూడా. అయినా సరే నేనేం అంత మంచోడిని కాదు అంటున్నాడు మహేష్ బాబు.
తన తండ్రికి విపరీతమైన మంచితనం ఉందన్న మహేష్... ఆయనకు ఏ విషయంలోనూ నో అనడం తెలీదంటున్నాడు. అందుకే ఆయన కెరీర్ లో కొన్ని రాంగ్ సినిమాలు ఉన్నాయన్న మహేష్... పదహారేళ్ల వయసులోనే ఇవన్నీ గమనించాడట. అవన్నీ మైండ్ లో ఉండిపోవడంతో.. సూపర్ స్టార్ కృష్ణని చూసి మంచి, చెడు నేర్చుకున్నానని, అంత మంచితనం వద్దనుకున్నానని చెబ్తున్నాడు. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాడట ఒకటి రెండుసార్లు. బాగుంది ఈ మాత్రానికే మంచోడు కాకపోతారా ఏంటి. అయినా మంచోళ్లు ఎప్పుడైనా నేను మంచోడిని అంటారా ఏంటి. ? ఒకరి మంచితనం అనేది పక్కనవాళ్లు ఇచ్చే గుర్తింపు.
అంత స్టార్ అయి ఉండి... ఇంత సింపుల్ గా చెప్పడమంటే.. మహేష్ కే చెల్లింది. అన్నట్లు మనోడికి క్రికెట్ అన్నా, సినిమాలు చూడ్డమన్నా విపరీతమైన ఇష్టం. తమిళం, హిందీ సినిమాలు ఇప్పటికి కూడా థియేటర్ కి వెళ్లి చూస్తుంటాడట. దుబాయ్, సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడి థియేటర్ లలో చూస్తానని చెప్పాడు మహేష్ ఓ ఇంటర్వ్యూలో.