Begin typing your search above and press return to search.

మహేష్‌.. ఈసారి ఎవ్వరినీ వదలట్లేదు..

By:  Tupaki Desk   |   14 May 2016 11:39 AM IST
మహేష్‌.. ఈసారి ఎవ్వరినీ వదలట్లేదు..
X
''బ్రహ్మోత్సవం'' డబ్బింగ్‌ పనులు కూడా పూర్తయపోవడంతో.. ఇక ప్రమోషన్స్ లో తన రేంజ్‌ ఏంటో చూపించడం మొదలెట్టేశాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. పైగా ఈసారి ప్రమోషన్ల విషయంలో ఎవ్వరినీ వదలడట. ఎవ్వరినీ డిజప్పాయింట్‌ చేయడట.

నిన్న సాయంత్రం నుండి మహేష్‌ బాబు ప్రమోషన్ల హవా మొదలైంది. మనోడు ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లో కొందరు మీడియా వారికి ఇంటర్యూలు ఇచ్చాడు. వెబ్‌ మీడియాలకు కూడా ఒక 10 నుండి 15 నిమిషాల టైమ్‌ కేటాయించాడు. ఈరోజు ఏకంగా మనకున్న 21 ఛానళ్ళకూ ఇంటర్యూలు ఇస్తున్నాడు. గతంలో ఓ రెండు మూడు పెద్ద ఛానళ్ళకు ఇంటర్యూలు ఇచ్చి.. తరువాత ఓ జనరల్‌ ఇంటర్యూ రికార్డు చేయించి అందరికీ ఇచ్చేశేవాడు. ఇప్పుడు అలా కాదు.. అందరికీ విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చేస్తున్నాడు అంతే. ప్రింట్‌ మీడియాతో పాటు.. రేడియోలకు కూడా ఈసారి కాస్త గట్టిగానే ఇంటర్యూలు ఇస్తాడట. మన తెలుగులో స్టార్‌ హీరోలెవ్వరూ ఇలా అన్ని ఛానళ్లు అండ్‌ మీడియాలకు సాధారణంగా ఇంటర్యూలు ఇవ్వరు. కాని మహేష్‌ రూటే వేరు.

ప్రమోషన్లతోనే కలెక్షన్ల రికార్డులు సాధించవచ్చు అని బాలీవుడ్‌ లో షారూఖ్‌ ఖాన్‌ ప్రూవ్‌ చేస్తే.. టాలీవుడ్‌ లో మహేష్‌ కూడా అదే దించేస్తున్నాడు. చూస్కోండి మరి ఇక బ్రహ్మోత్సవం పైనల్‌ ఫిగర్స్‌ ఏ రేంజులో ఉంటాయో!!